Saturday, March 31, 2012

శ్రుతి రంజని::: రాగం ::: తాళం:: దేశాది


ప. ఏ దారి సంచరింతురాయిక పల్కరా


అ::శ్రీ-దాది మధ్యాంత రహిత
సీతా సమేత గుణాకర నే(నే దారి)


చ::అన్ని తానను మార్గమున చనగ
నన్ను వీడను భారమనియాడెదవు
తన్ను బ్రోవు దాస వరదాయంటే
ద్వైతుడనెదవు త్యాగరాజ నుత (ఏ దారి)

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

raagaM::SRtiraMjani
taaLaM::daeSaadi

pallavi::

ae daari saMchariMturaa ika balkuraa ||ae||

anu pallavi::

Sree daadi madhyaaMta rahita
seetaasamaetaguNaakara nae ||nae||

charaNamu(lu)
anni taananu maargamunaku janitae
nannu veeDanu bhaaramani yanaevu
nannu@M brOvaraa sadaa yaMTae
dvaitu@MDanaevu tyaagaraajanuta ||ae||

Friday, March 30, 2012

రాగం జోన్‌పురి::తాళం::రూపక

రాగం జోన్‌పురి
తాళం::రూపక

ప్రయాగ రంగదాసు వారి కృతి

రాముడుద్భవించినాడు రఘుకులంబునా
రాముడుద్భవించినాడు రఘుకులంబునా
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా
తామసులను దునిమి దివిజ..
సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా

తనరు చైత్ర శుధ్ధ నవమి పునర్వసందునా
సరస కర్కాటక లగ్నమరయగ..
సురవరులెల విని కురియింపగ విరుల వాన
రాముడుద్భవించినాడు రఘుకులంబునా

దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయ మారుతములు..
దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప
రాముడుద్భవించినాడు రఘుకులంబునా

ధరను కుడిమి లంక పురమును అరసి బ్రోవగా
కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను
కరుణుంచియు వరమివ్వగ స్థిరుడై

శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా
తామసులను దునిమి దివిజ..
సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా

Tuesday, March 27, 2012

Kaapi ::: Raagamraagam:::kaapi
22 kharaharapriya janya
Aa: S R2 M1 P N3 S
Av: S N2 D2 N2 P M1 G2 R2 S

taaLam: aadi
Composer: Paapanaasam Shivan
Language: Tamil

pallavi

enna tavam sheidanai yasOdA engum nirai parabhrammam ammAvenr-azhaikka
(enna tavam)

anupallavi

IrEzu bhuvanangaL paDaittavanaik-kaiyil Endi shIrATTi pAlUTi tAlATTa nI
(enna tavam)

caraNam 1

bhramanum indranum manadil porAmai koLLa
uralil kaTTi vAi pottik-kenjavaittAi tAyE
(enna tavam)

caraNam 2

sanakAdiyar tava yOgam sheidu varundi
sAdhittadai punita mAdE eLidil pera
(enna tavam)

మోహన:::రాగం


మోహన:::రాగం

ఆది::తాళం

Oothukadu Venkata Subbayyar kriti

పల్లవి::

స్వాగతం కృష్ణాఆ,ఆ, స్వాగతం కృష్ణా కృష్ణా
శరణాగతం కృష్ణా
ఇక స్వాగతం కృష్ణా కృష్ణా స్వాగతం కృష్ణా
మధురాపురి సదనా మృదు
వదనా మధుసూదన ఇహ

// స్వాగతం//౩ సార్లు

అనుపల్లవి::

భోగ దప్త సులభా సుపుష్ప గంధ కలభా
కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద

(స్వాగతం)

చరణం::

ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా
కువలయాపీడమర్దన కాళింగ నర్తన
గోకులరక్షణ సకల సులక్షణ దేవా -
శిష్ట జన పాల సంకల్ప కల్ప
కల్ప శత కోటి అసమపరాభవ
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
మధుర మధుర రతి సాహస సాహస
ప్రతి యువతి జన మానస పూజిత

స ,గప, గరి , ,ప గ రి స గ స ,
స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా
స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస
స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం

బైరవి::రాగం::తాళం::ఆదిరాగం బైరవి::తాళం::ఆది

20 నటభైరవి జన్య

Aa: S R2 G2 M1 P D2 N2 S
Av: S N2 D1 P M1 G2 R2 S

Composer: Tyaagaraaja
Language: Telugu

పల్లవి::

ఏ నాటి నోము ఫలమో
ఏ దాన బలమో

అనుపల్లవి::

శ్రీ నాథ బ్రహ్మకైనను నీదు
సేవ దొరుకునా తనకు కలుగుట (ఏ)


చరణం::1

నేను కోరిన కోర్కలెల్లను
నేడు తనకు నెరవేరెను
భాను వంశ తిలక నా పాలి
భాగ్యమా సజ్జన యోగ్యమా తన(కే)

చరణం::2

నీదు దాపు నీదు ప్రాపు దొరికెను
నిజముగా నే నీ సొమ్మైతిని
ఆది దేవ ప్రాణ నాథ
నాదంకమందునుంచి పూజించ (ఏ)

చరణం::3

సుందరేశ సుగుణ బృంద దశరథ
నందనారవింద నయన పావన
అందగాడ త్యాగరాజ నుత సుఖ-
మనుభవించ దొరికెరా భళి తన(కే)

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

raagam:::bhairavi::taalam::aadi

20 naTabhairavi janya

Aa::--S R2 G2 M1 P D2 N2 S
Av::--S N2 D1 P M1 G2 R2 S


Composer::Tyaagaraaja
Language::Telugu

pallavi::

EnATi nOmu phalamO E dAna balamO

anupallavi::

shrInAtha brahmakainanu nIdu sEva dorakunA tanaku galguTa

caraNam::1

nEnu kOrina kOrkE lellanu nEDu tanaku neravErEnu bhAnu-
vamsha tilaka nApAli bhAgyamA sajjana yOgyamA tanak-

caraNam::2

nIu dApu IEdu prApu dorikEnu nijamugA nE nI sommai-
tini AdidEva prANanAtha nAdanka mandunuci pUjinca

caraNam::3

sundarEsha suguNabrnda dasharatha nandana aravinda
nayana pAvana andagADa tyAgarAjanuta sukham
anubhavinca dorikErA danakika

Monday, March 26, 2012

రేవతి ::: రాగం::ఆది తాళం
ఇటీవలి కాలంలో దక్షిణభారత నృత్య సాంప్రదాయమైన భరతనాట్యంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆంశం - భో శంభో శివ శంభో. నృత్యానికి తల్లి వంటిది అయిన శివతాండవములో ఉండే లయ, స్తుతి, శివతత్త్వము ఈ రచనలో ఉన్నాయి. చిదంబరలయుడై ఆ పరమశివుడు నర్తించే విధానాన్ని ఈ కృతి మనకు క్షణం క్షణం గుర్తు చేస్తుంది. రేవతి రాగం, ఆది తాళంలో స్వరపరచబడి, సంస్కృత భాషలో ఈ గీతం వ్రాయబడింది. ఈ కృతిని సంగీత కళానిధి మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలాపించారు.వారి గళంలో ఈ కీర్తన వినండి.
రేవతి ::: రాగం::ఆది తాళం

సాహిత్యం::దయానంద సరస్వతి స్వామి
భో శంభో శివశంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |భో శంభో శివశంభో స్వయంభో|

నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ అగమ భూత ప్రపంచ రహిత
నిజగుహనిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ |భో శంభో శివశంభో స్వయంభో|

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం
తోం తోం తరికిట తరికిట కిటతో
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టిత వేషా
నిత్య నిరంజన నిత్య నటేశా ఈశా సభేశా సర్వేశా |భో శంభో శివశంభో స్వయంభో|

Tuesday, March 20, 2012

రాగం:ధర్మవతి (తాళం::ఆది )
పల్లవిః:

మంగాంబుధి హనుమంతా నీ శరణ
మంగవించితిమి హనుమంతా
చరణం;
బాలార్క బింబము ఫలమని ప ట్టిన
ఆలరి చేతల హనుమంతా
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనినా హనుమంతా

ప పమగమ మగరిగ గరిసరి రిసనిస సరిసని
సరిగ రిసా రిగామ గరీ గమాప మగరిగమప
పమగమపద దపమపదని నిదపదనిస సనిదనిసరి
గరినిద మదనీద నినిదమ గమదామ నిదమగరిగ "మ0గా"

చరణం::1

జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా
చరణం
పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా

ప తకితతామ్ తకితజామ్ తకితజుమ్ తకితతొమ్ తరితజుమ్
సరిగ తజుమ్ రిగమ తజుమ్ గమప కితకు గమప కుకుమ్ గమపద
ఝనకు పదని సరిత ఝనుత ఛనుత నిసరి కుకుమ్ ఘనుకుత నీద
తనకు తరితగామ తరితఝనుత "మ0గ"


dharmaavathi::raagam...Adi..taalam..

Mangaambudhi Hanumantha Nee Sharana Mangavinchithimi Hanumanthaa...
Baalaarkabimbamu Balamani Pattina Aalarichethanaa Hanumanthaa
Dhunaribrahma dhulache Varamulu Kolichekoninaa ooo Hanumanthaa
Jaladhidhata neesathvamukapulaku alaritelipitivi Hanumantha
ilayunakashamu nekamuganatu balimi perigithivi bhali Hanumantha

P..Thakitathom..Thakitajam..Thakitajam..Thakitathom..Tharithajam..SRG..Thajam..
RGM..Thajam..GMP..Thiratha GMP..Kuku GMPD..Thanaku PDN..Tharithajanutha..
Janu DNSR..Kukuthanuka ND..Thanukutharita DM..Tharithajanutha

Paathaalamulopali Mairaavanu Aathala Champina Hanumanthaa
Chethulo Morchuka Shree Venkatapathi Eethalagoliche Hitha Hanumanthaa

P..Thakitathom..Thakitajam..Thakitajam..Thakitathom..Tharithajam..SRG..Thajam..
RGM..Thajam..GMP..Thiratha GMP..Kuku GMPD..Thanaku PDN..Tharithajanutha..
Janu DNSR..Kukuthanuka ND..Thanukutharita DM..Tharithajanutha

Monday, March 19, 2012

వందేమాతరం వందేమాతరం..
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం

కోటి కోటి కంఠ కలకల నినాద కరాళే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదళ వారిణీం మాతరం వందేమాతరం

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, మాతరం వందేమాతరం

శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
బంకించంద్ర చటర్జీ

(బంకించంద్ర చటోపాధ్యాయగారు 1870 ఆనందమఠం నవల కోసం ఓకే ఆవేశంతో రాసిన ఈ గేయం 1886 వరకు పుస్తకం పుటలకే పరిమితమైంది, దాదాపు 16 సంవత్సరాల తర్వాత దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతీయ కాంగ్రెస్ సదస్సులో మొదటిసారి ఆలపించడంతో ఈ పాటకు ప్రాధాన్యం వచ్చింది)

Thursday, March 1, 2012

దేవగాంధారి:::రాగంపల్లవి::
చల్లని చూపులవాని చక్కనివాని పీలి
చొల్లెపుం జుట్లవానిఁ జూపరమ్మ చెలులు


చరణం::1
వాడలోని చెలులను వలపించి వచ్చెనే | వాడు |
చేడెల మనసు దొంగ చిన్నికృష్ణుడు
యేడుగడయును దానై యెలయించె నన్నును |వాని
జూడక వుండగ లేను చూపరమ్మ చెలులు

చరణం::2
మందలోని గొల్లెతల మరగించి వచ్చెనే | వాడు |
సందడిపెండ్లికొడుకు జాణకృష్ణుడు
ముందు వెనకా నలమి మొహింపించె నన్నును | వాని|
పొందులు మానగ లేను పోనీకురే చెలులు


చరణం::3
ఇంటింటి యింతుల నెల్లా యెలయించి వచ్చెనే వాడు
దంటవాడు కలికి చేతలకృష్ణుడు
నంటునను శ్రీవెంకటనాథుండై నన్ను గూడెనే | వాని |
వొంటి బాయలే నావద్ద నుంచరమ్మ చెలులు.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

challani choopulavaani chakkanivaani | peeli |
chollepu@M juTlavaani@M jooparamma chelulu

VaaDalOni chelulanu valapinchi vacchenE | vaaDu |
chEDela manasu donga chinnikRshNuDu
yEDugaDayunu@M daanai yelayinche nannunu |vaani@M|
jooDaka vunDaga lEnu chooparamma chelulu

mandalOni golletala maraginchi vacchenE | vaaDu |
sandaDipenDlikoDuku jaaNakRShNuDu
mundu venakaa nalami mohimpinche nannunu | vaani|
pondulu maanaga lEnu pOneekurE chelu(lu?)

inTinTi yintula nellaa yelayinchi vacchenE | vaaDu|
danTavaaDu kavi(li?) ki@MchEtalakRshNuDu
nanTunanu SreevenkaTanaathu@MDai nannu@M gooDenE | vaani |
vonTi@M baayalE naavadda nuncharamma chelulu.