Thursday, December 17, 2015

మధ్యమావతి::రాగ



త్రిపుట::తాళం 

పల్లవి::

రామాభి రామ మామవ శ్రీ రామ

అనుపల్లవి::

రామ రవికుల లలామ రాక్షస కుల భీమా రామచంద్ర 
సుగుణ సాంద్ర శ్రీ మనసాంబుధి చంద్ర  

చరణం::

పవనాత్మజ సంపూజిత పరమాద్భుత నిజ చరిత దేవాది దేవ
మాధవ శ్రీ వాసుదేవ సార్వభౌమ సత్యకామ సర్వలోక వంద్య రామ

Saturday, September 5, 2015

మాళవశ్రీ::రాగం















పల్లవి::

శ్రావణ బహుళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుడుదయించె చెలులాల వినరే

చరణం::1

అసురుల శిక్షించ నమరుల రక్షించ 
వసుధ భారమెల్ల నివారింపను
వసుదేవికిని దేవకిదేవికిని
అసదృశమగు కృష్ణుడవతారమందెను

చరణం::2

గోపికల మన్నించ గొల్లలనెల్లఁ గావగ
దాపై మునులనెల్ల దయసేయను
దీపించ నందునుకి దేవియైన యశోదకు
యేపున సుతుడై కృష్ణుడిన్నిటఁ బెరిగెను

చరణం::3

పాండవుల మనుపగ పదారువేల పెండ్లాడగ
నిండి శ్రీవేంకటాద్రి పై నిలుచుండగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాగలించగ
దండియై యుండ కృష్ణుడు తగ నుతికెక్కెను

MaalavaSree::Raagam 

:::::::

SraavaNa bahuLaashTami savarEtrikaaDanu
SreevibhuDudayinche chelulaala vinarE

::::1

asurula Sikshimcha namarula rakshincha 
vasudha bhaaramella nivaarimpanu
vasudEvikini dEvakidEvikini
asadRSamagu kRshNuDavataaramandenu

::::2

gOpikala mannincha gollalanella gaavaga
daapai munulanella dayasEyanu
deepincha nandunuki dEviyaina yaSOdaku
yEpuna sutuDai kRshNuDinniTa berigenu

::::3

paanDavula manupaga padaaruvEla penDlaaDaga
ninDi SreevEnkaTaadri pai niluchunDagaa
anDa nalamElmanga nakkuna gaagalinchaga
danDiyai yunDa kRshNuDu taga nutikekkenu

భల్లాతి::రాగం













పల్లవి::

జగతిలో మనకెల్ల జయంతి నేఁడు
పగటున నందరికి పండుగ నేఁడు

చరణము::1

అదివో శ్రావణ బహులాష్టమి నేఁడు
పొదిగొన్న రోహిణి సంపూర్ణము నేఁడు
కదిసి యద్దమరేత్రికాడ నేఁడు
ఉదయించెఁ గృష్ణుఁడు చంద్రోదయాన నేఁడు

చరణము::2

వసుదేవదేవకుల వరము నేఁడు
పసగా ఫలియించె రేపల్లెలో నేఁడు
లొసరి యశోదనందగోపుఁడు నేఁడు -యీ
సిసువును సుతుఁడంటాఁ జేలఁగిరి నేఁడు

చరణము::3

హరిమాయ కంసుమద మడఁచె నేఁడు
పొరుగిరుగులవా రూప్పొఁగిరి నేఁడు
సిరి నలమేల్మంగతో శ్రీవేంకటేశుఁడై నిల్చె
అరుదుగా గొల్లెతలు ఆడుకొనేరు నేఁడు





Bhallati::Ragam

::::

jagatilO manakella jayaMti nE@mDu
pagaTuna naMdariki paMDuga nE@mDu

::::1

adivO SraavaNa bahulaashTami nEDu
podigonna rOhiNii sampUrNamu nEDu
kadisi yaddamarEtrikaaDa nEDu
udayinche gRshNuDu chandrOdayaana nEDu

::::2

vasudEvadEvakula varamu nEDu
pasagaa Paliyinche rEpallelO nEDu
losari yaSOdanandagOpuDu nEDu-ii
Sisuvunu sutuDanTaa jElagiri nEDu

::::3

harimAya kamsumada maDamche nEDu
porugirugulavA rUppo@mgiri nEDu
siri nalamElmangatO SreevEnkaTESuDai nilche

arudugaa golletalu ADukonEru nEDu

Wednesday, May 6, 2015

రాగం::శుద్ధసావేరి


రాగం::శుద్ధసావేరి 
తాళం::రూపకం 
Aa: S R2 M1 P D2 S
Av: S D2 P M1 R2 S

పల్లవి:: 

కాలహరణ మేలరా హరే సీతారామ 

అనుపల్లవి:: 

కాలహరణమేల సుగుణజాల కారుణాలవాల 

చరణం:: 

1::చుట్టుచుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భువిని 
పుట్టగానే నీ పదములు బట్టుకొన్న నన్ను బ్రోవ 

2::పొడవున ఎంతాడుకొన్న భూమిని త్యాగంబురీతి 
కడూవేల్పులమిన్న నీవుగాక ఎవరు నన్ను బ్రోవ 

3::దినదినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణుజొచ్చి 
తనువుధనము నీదె యంటి త్యాగరాజవినుత రామ 

4::ఇష్టదైవమా మనోభీష్టమీయలేక ఇంత 

కష్టమా త్యాగరాజ కామితార్ధఫల మొసంగ

raagam: sudda saavEri
29 dheera shankaraabharaNam janya
Aa: S R2 M1 P D2 S
Av: S D2 P M1 R2 S

taaLam: roopakam
Composer: Tyaagaraaja
Language: Telugu

pallavi

kAlaharaNa mElarA harE sItArAma
anupallavi

kAlaharaNa mEla suguNa jAla karuNAlavAla

caraNam 1

cuTTi cuTTi pakSulella ceTTu vedaku rIti bhuvini puTTulEka nE n padamula baTTu konna nannu brOva

caraNam 2

poDavuna entADukonna bhUmini tyAgambu rIti kaDu vElpula nIvugAka evaru nannu brOva

caraNam 3

dina dinamu tirigi tirigi dikkulEka sharanu jocci tanuvu dhanamu nIdEyaNTi tyAgarAja vinuta rAma

caraNam 4

iSTa daivamA manObhISTa mIyalEka inka kastamA tyAgarAju kAmitArtha phala mosanga

Saturday, April 25, 2015

ఖమాస్::రాగం


ఖమాస్ రాగం::ఆదితాళం

పల్లవి::

అమ్మా నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా
నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా
నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా
నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా

చరణం::1

ముమ్మాటికి నీవే నా దిక్కమ్మా
ముమ్మాటికి నీవే నా దిక్కమ్మా
మానవ మాత్రుడనమ్మా

నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా

ముమ్మాటికి నీవే నా దిక్కమ్మా
మానవ మాత్రుడనమ్మా

నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా

చరణం::2

పుట్టిమెట్టి  జిటునట్టి తెరలోనికి 
నాటన బ్రతుకేటికమ్మా

పుట్టిమెట్టి  జిటునట్టి తెరలోనికి 
నాటన బ్రతుకేటికమ్మా..3

పుట్టగానే మురళిగానా పక్కమీచ్చి
నట్టుగా మాయమ్మా

నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా

పుట్టగానే మురళిగానా పక్కమీచ్చి
నట్టుగా మాయమ్మా

నిన్ను కోరిన కోరికలిమ్మా
నీ అభిమాన కుమారుడను అమ్మా


khamaas raagam::AditaaLam

pallavi::

ammaa ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa
ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa
ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa
ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa

charaNam::1

mummaaTiki neevE naa dikkammaa
mummaaTiki neevE naa dikkammaa
maanava maatruDanammaa

ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa

mummaaTiki neevE naa dikkammaa
maanava maatruDanammaa

ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa

charaNam::2

puTTimeTTi  jiTunaTTi teralOniki 
naaTana bratukETikammaa

puTTimeTTi  jiTunaTTi teralOniki 
naaTana bratukETikammaa..3

puTTagaanE muraLigaanaa pakkameechchi
naTTugaa maayammaa

ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa

puTTagaanE muraLigaanaa pakkameechchi
naTTugaa maayammaa

ninnu kOrina kOrikalimmaa
nee abhimaana kumaaruDanu ammaa



Thursday, April 9, 2015

శహన::రాగం


శహన::రాగం
తాళం::ఆది
28 హరికాంభోజి జన్య

Aa::S R2 G3 M1 P M1 D2 N2 S
Av::S N2 S D2 N2 D2 P M1 G3 M1 R2 G3 R2 S

Composer::Tyaagaraaja


పల్లవి::

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి

అనుపల్లవి::

పరివారులు విరిసురటులచేబడి
విసరుచు గొసరుచు సేవింపగ

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి

చరణం::1

పులకాంకితుడై ఆనందాశ్రువుల
నింపుచు మాటలాడవలెనని
కలవరించగని పది పూటలపై
గాచెదనను త్యాగరాజ వినుతుని

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక కంటి

Tuesday, March 10, 2015

యమన్ కళ్యాణి::రాగం


పల్లవి:
నగవులు నిజమని నమ్మేదా
మొగి నడి యాశలు వొద్దనవే

చరణం::1 

తొల్లిటి కర్మము దొంతుల నుండగ
చెల్లవోయిక చేసేదా
ఎల్ల లోకములు ఏలేటి దేవుడా
వొల్లనొల్లనిక వొద్దనవే

||నగవులు||

చరణం::2

నలినీ నామము నాలుక నుండగ
తలకొని ఇతరము తడవేదా
బలు శ్రీ వెంకటపతి నిన్ను గొలిచి
వొలుకు చెంచలము ఒద్దనవే

||నగవులు||

nagavulu nijamani nammEda 
ogina naDi yASalu vaddana vE
nagavulu

tolliTi karmamu dontala nunDaga
chellabO yika jEsEdA
yella lOkamulu yElETi dEvuDa 
olla nolla nika vaddanavE
nagavulu

pOyina janmamu porugula nunDaga 
cheeyanaka indu jela gEdA
vEyi nAmamula vennuDa mAyalu 
Oyayya nikka noddana vE 
nagavulu

nali neenAmamu nAlika nunDaga 
tala koni itaramu daDavEdA
balu Sree vENkaTa pati ninnu golichi 

voluku chenchalam loddanavE