Friday, August 26, 2011

dASarathE - kOkilapriya - AlApana .

Mandolin U. Srinivas - Tyagaraja - dASarathE - kOkilapriya - AlApana .mp3
Found at bee mp3 search engine

Friday, August 5, 2011

విష్ణు దేవు పాదములే





విష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా ||

గోవిందునిపాదములే కోరి యిహపరములు
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితి పాయరో పాపములు ||

హరిపాదములే మాకు నన్నపానభోగములు
పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందర వెనకా మాకు
శరణంటి మెందైనా చనరో దుఃఖములు||

అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే
మనసున గొలిచితి మానరో భవములు||

Monday, August 1, 2011

Baje Sargam - DD Film



మిలే సుర్ మేరా ఐక్యతా గీతం తర్వాత దూరదర్శన్ బంగారు రోజుల్ని గుర్తుకు తెచ్చే మరొక గీతం "బజే సర్ గం"! మీలో చాలామంది చూసే ఉంటారు

భరతనాట్యం,కూచిపూడి,మోహినీ అట్టం,కథాకళి,ఒడిస్సీ,మణీపురి నాట్యరీతులు,వీణ,వయొలిన్,సారంగి,కర్ణాటక హిందుస్థానీ గాత్ర సంగీతాలు, అన్నీ ఈ గీతంలో ప్రతిబింబిస్తాయి.

భీమ్ సేన్ జోషి స్వరంలో పరవళ్ళు తొక్కిన గమకాలు,బాలమురళి గొంతులో పలికిన భావాలు,రవిశంకర్ సితార ఒలికించిన హొయలు,...ఎంత గొప్పగా ఉన్నాయో ఆస్వాదించండి

"నలుదెసల రాగముదయించెను
గజ్జెలు ఘల్లన లయగ పలికెను
గొంతులెల్ల భావముగ పాడెను
ఇది దేశ రాగ భావ సమ్మేళనం" అంటూ భావయుక్తంగా పాడి,ముక్తాయింపుగా వయొలిన్ మీద ఒక చెణుకు విసురుతారు చూడండి! అద్భుతం నిజంగా

హరిప్రసాద్ వేణువు నుంచి వెలువడే ఆ తరంగాలు మన హృదయాలలోకి ప్రవహిస్తుంటే "మురళీ ధరా నీ స్వర లహరులలో మరణమైనా మధురమురా" అనిపించక మానదు

ఈ కళలన్నీ భారత దేశ సంప్రదాయమనే సాగరంలో కలిసే నదులే అన్న సందేశం ఈ పాటలో ఉంటుంది. అందుకేనేమో ఈ పాటని "దేశ్" రాగంలో రూపొందించారు.

ఒక్కసారి ఈ పాటను అవలోకించి చెమర్చిన కళ్ళతో భారతీయ సంగీత, నాట్య రీతులకు సలామ్ కొట్టండి

నాకు నచ్చి సుజాతగారి బ్లాగులో సేకరించినవి