Saturday, March 14, 2009

ఖమాస్:: స్వరజతి::ఆది తాళం



28 హరికాంభోజి జన్య!!
ఆరొ: స, మ1, గ3, మ1, ప, ద2, ని2, సా. !!
అవ: సా, ని2, ద2, ప, మ1, గ3, రి2, స. !!
!! పల్లవి !!
సాంబ శివాయనవే రజితాగిరి !
!! అనుపల్లవి !!
సాంభవీ మనోహరా పరాత్పరా కౄపాకరా శ్రీ
సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 1 !!
నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మిదిని శివ
సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 2 !!
పరమ దయా నిధి వనుచు మరువక నా
హ్రుదయమునా..మహదేవ మహప్రభో సుందర నయన
సురవర దాయక భవభయ హరశివ.. సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 3!!
స్థిర మధురపురమునా వరములొసగు హరుని
నిరతమును దలచి.. సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 4!!
శ్రీ... శుభకర శశి మకుటధరా
జయ విజయ త్రిపురహర..
శ్రితజన లోలద్భుత గుణ శీలా క్రుతనుతపాలా
పతితుని లోలా-ముదంబల రంగ పదాబ్జములను
పదంబులు జేర్చు పసుపతినీ...జ్ణ్యానముధ్యానము
స్నానము పానము దానము మానము అభిమానమనుచు
కనికరమునచరణంబులుకనుకొనుష్రుతులన్నుతుల
శరణనుచు సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 5!!
సారెసారెగు నీ నామ మంత్రం
కోరినాను నీ పాదాంబుజ మంత్రం
దాసుడౌ చిన్ని కౄష్ణునికి దిక్కు నీవేయని
సొక్కనాథుని నమ్ముకొని సాంబ శివాయనవే రజితాగిరి
!!

No comments: