Friday, April 3, 2009

రాగ మాలిక



!! శ్రీ నామ రామాయణం !!

!! కల్యాణి రాగం !!

:: ఆది తాళం::

::బాల కాండ::

శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్ (2)

శేష తల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మా ధ్యమరా పార్థిత రామ్

చండ కిరణ కుల మండల రామ్
శ్రీమద్దశరథ నందన రామ్

కౌసల్యా సుఖ వర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియతన రామ్

ఘోర తాటకా ఘాతుక రామ్
మారీచాదిని పాతక రామ్

కౌశిక సుఖ సంరక్షక రామ్
శ్రీమదహల్యో ద్ధారక రామ్

గౌతమ ముని సంపూజిత రామ్
సురముని వరగణ సంస్తుత రామ్

నావిక ధావిత మౄదుపద రామ్
మిథిలా పురజన మోహక రామ్

విధేహి మానస రంజక రామ్
త్ర్యంబక కార్ముక బంజక రామ్

సీతార్పిత వర మాలిక రామ్
కృతవై వాహిక కౌతుక రామ్

భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమదయోధ్యా పాలక రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(2)

!!శ్రీ నామ రామయణం !!

!! దర్భార్ కానడ రాగం !!

:: అయోధ్యకాండ ::

అగణిత గుణగణ భూషిత రామ్
అవనీతనయా కామిత రామ్(2)

రాకాచంద్ర సమానన రామ్
పితౄ వాక్యాశ్రిత కానన రామ్

ప్రియ గుహ వినివేదిత పద రామ్
ప్రక్షాళితనిజమృదు పద రామ్

భరథ్వాజ ముఖానందక రామ్
చిత్రకూటా ద్రిని కేతన రామ్

దశరథ సంతత చింతిత రామ్
కైకేయీ తనయర్ధిత రామ్

విరచిత నిజ పితృ ఖర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్

రామ రామ జయ రాజ రామ్
రామ రామ జయ సీత రామ్
(2)

!! శ్రీ నామ రామయణం !!

!! రాగం వలజి !!

::అరణ్యకాండ::

దండకావన జన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్(2)

శరభంగ సుతీక్లార్చిత రామ్
ఆగస్త్యానుగ్రహ వర్దిత రామ్

గృధ్రాధిపసం సేవిత రామ్
పంచవటీతట సుస్థిత రామ్

శూర్పణఖార్తి విధాయక రామ్
ఖరదూషణ ముఖసూధక రామ్

సీత ప్రియ హరిణానుగ రామ్
మారీచార్తి కృదాశుగ రామ్

వినష్ట సీతాన్వేషక రామ్
గృధ్రాధి పగతి దాయక రామ్

శబరీ దత్త ఫలాశన రామ్
కబంధ బాహుచ్ఛేదన రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(2)

!! శ్రీ నామ రామాయణం !!

రాగం::హంస నాదం ::

::::కిష్కింద కాండ::::

హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవా-భీష్టద రామ్(2)

గర్విత వాలి సంహారక రామ్
వానరదూత ప్రేషక రామ్

హితకర లక్ష్మణ సంయుత రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీత రామ్
(2)






!! శ్రీ నామ రామాయణం !!

:::రాగం:::దేష్:::

:::సుందరాకాండ:::

కపివర సంతత సంస్మ్రుత రామ్
తద్గతివిఘ్నధ్వంసక రామ్

సీతా ప్రాణా ధారక రామ్
దుష్ట దశానన దూషిత రామ్

శిష్ట హనూమ ద్భూషిత రామ్
శీతా వేదిత కాకావన రామ్

కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనాశ్వాసిత రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)


!! శ్రీ నామ రామయణం !!

::శుద్ధ ధన్యాసి::

( యుద్ధ కాండ )

రావణ నిధనా ప్రస్ద్తిత రామ్
వానర సైన్యా సమావృత రామ్

శోషిత సరిధీశార్ధిత రామ్
విభీషణా భయ దాయక రామ్

పర్వత సేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరశ్ఛేదక రామ్

రాక్షస సంఘ విమర్ధక రామ్
అహిమహి రావణ మారణ రామ్

సంహృత దశముఖ రావణ రామ్
విధిభవ ముఖసుర సంస్తుత రామ్

ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీత దర్శన మోదిత రామ్

అభిషిక్త విభీషణ నత(వందిత) రామ్
పుష్పక యానా రోహణ రామ్

భరద్వాజాభి నిషేవణ రామ్
భరత ప్రాణ ప్రియకర రామ్

సాకేతపురీ భూషణ రామ్
సకల స్వీయ సమానత రామ్

రత్నల సత్పీఠ-స్థిత రామ్
పట్టాభిషేకా లంకృత రామ్

పార్థివ కుల సమ్మానిత రామ్
విభీషణార్చితరంగక రామ్

కీశకులానుగ్రహకర రామ్
సకల జీవ సంరక్షక రామ్

సమస్త లోకా ద్ధారక రామ్ (2)
సకల జీవ సంరక్షక రామ్
సమస్త లోకా ద్ధారక రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)


!! శ్రీ నామ రామాయణం !!

::హిందుస్తాని కాఫీ::

:::ఉత్తర కాండ:::

ఆగత మునిగణ సంస్తుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్(2)

సీతా లింగన నిర్వౄత రామ్
నీతిసురక్షిత జనపద రామ్

విపినత్యాజిత జనకజ రామ్
కారిత లవణా సుర వధ రామ్

స్వర్గత శంబుక సంస్తుత రామ్
స్వతనయ కుశ లవ నందిత రామ్

ఆశ్వమేధ కృతు దీక్షిత రామ్
కాలనివేదిత సుర పద రామ్

అయోధ్యక జన ముక్తిద రామ్
విధిముఖ విబుధా నందక రామ్

తేజోమయ నిజ రూపక రామ్
సంస్మౄతి బంధ విమోచన రామ్

ధర్మ స్తాపన తత్పర రామ్
భక్తి పరాయణ ముక్తిద రామ్

సర్వ చరాచర పాలక రామ్
సర్వభవామయ వారక రామ్

వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్(2)

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)


:::మంగళం:::

భయహర మంగళ దశరధ రామ్
జయ జయ మంగళ సీతా రామ్

మంగళకర జయ మంగళ రామ్
సంగతశుభవిభవోదయ రామ్

ఆనందామృతవర్షక రామ్
ఆశ్రితవత్సల జయజయ రామ్

రఘుపతి రాఘవ రాజా రామ్
పతితపావన సీతా రామ్

1 comment:

SaiRam said...

Very Nice Thank you