విష్ణు దేవు పాదములే
విష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు
వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా ||
గోవిందునిపాదములే కోరి యిహపరములు
శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు
దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు
భావములో నిలిపితి పాయరో పాపములు ||
హరిపాదములే మాకు నన్నపానభోగములు
పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు
మురహరు పాదములే ముందర వెనకా మాకు
శరణంటి మెందైనా చనరో దుఃఖములు||
అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు
దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు
యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే
మనసున గొలిచితి మానరో భవములు||
No comments:
Post a Comment