Thursday, June 28, 2012

సారంగ ::: రాగం




















సారంగ ::: రాగం
తాళం :::దేషాది

65 మేచ కల్యాణి జన్య

Aa: S R2 G3 M2 P D2 N3 S
Av: S N3 D2 P M2 R2 G3 M1 R2 S

పల్లవి::

ఎంత భాగ్యము మాపాల కల్గితివి
ఎవరీడు ముజ్జగములలో తన(కెంత)

అనుపల్లవి::

చెంత జేరి సౌజన్యుడై పలికి
చింత బాగ తొలగించి బ్రోచితివి (ఎంత)

చరణం::2

మున్ను నీ సమీపమున వెలయు సం-
మునులనెల్లనణిమాది2 లీలలచే
తిన్నగాను పాలనము 3జేసినట్టు
నన్ను కాచితివి త్యాగరాజ నుత (ఎంత)

Variations

1ఎవరీడు – ఎవ్వరీడు
3జేసినట్టు – జేసినటున్బ్స్ప్;: జేసినట్టు – is appropriate.

saaranga ::: raagam
taaLam ::: dEshaadi

65 mEca kalyaaNi janya

Aa:::S R2 G3 M2 P D2 N3 S
Av:::S N3 D2 P M2 R2 G3 M1 R2 S

pallavi::

enta bhāgyamu māpāla kalgitivi
1evarīḍu muj-jagamulalō tana(kenta)

anupallavi::

centa jēri saujanyuḍai paliki
cinta bāga tolagiñci brōcitivi (enta)

charaNam::1

munnu nī samīpamuna velayu san-
munulanellanaṇimādi2 līlalacē
tinnagānu pālanamu 3jēsinaṭṭu
nannu kācitivi tyāgarāja nuta (enta)

Variations

1evarīḍu – evvarīḍu
3jēsinaṭṭu – jēsinaṭu : jēsinaṭṭu – is appropriate.

మోహన ::: రాగం








మోహన రాగం

పల్లవి::

ఎవ్వడెరుగును మీయెత్తులు
మువ్వంక మెరసె మీ ముఱిపెమయ్య

చరణం::1

సొలపుల నిన్నాపె చూచీనీ
నలుగడ నీవేల నవ్వేవు
తెలియవు మాకు మీ తెఱగులు
బలిమిని యెట్టయినా బతుకరయ్యా

చరణం::2

విరులనాపె నిన్ను వేసీనీ
కెరలి బొమ్మల జంకించేవు
సరిగానము మీ చందములు
పరిపరి విధముల బ్రదుకరయ్యా

చరణం::3

పెనగి ఆపె నిన్ను పిలిచీనీ
యెనసితివి శ్రీవేంకటేశ్వరుడా
నను నేలితివిటు నయమునను
పనివడి యిట్లానే బ్రదుకరయ్య

ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ

Mohana ::: Raagam


Pallavi::>

evvaDerugunu mIyettulu
muvvaMka merase mI mu~ripemayya

charanam::1

solapula ninnApe chUchInI
nalugaDa nIvEla navvEvu
teliyavu mAku mI te~ragulu
balimini yeTTayinA bratukarayyA

charanam::2

virulanApe ninnu vEsInI
kerali bommala jaMkiMchEvu
sarigAnamu mI chaMdamulu
paripari vidhamula bradukarayyA

charanam::3

penagi Ape ninnu pilichInI
yenasitivi SrIvEMkaTESwaruDA
nanu nElitiviTu nayamunanu
panivaDi yiTlAnE bradukarayya

Saturday, June 23, 2012

బిలహరి ::: రాగం










రచన:ములుకుట్ల నరసింహావధానులు(రామాయణం శాస్త్రులు) గారు

V. భాగవత ప్రార్ధన:

శ్లో!!ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్!
రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి!!






బిలహరి రాగం...ఆది తాళం

ప:ఎందుకీధర బుట్టి నాడనో నా కెరుగా జెప్పుము నిన్ను వీడను రామ!
అ:ఎందఱో మహానీయులందందు నీ భక్తి డెందమందున జేయ మందుడనై ఇటు!!లెందుకీ!!

౧.కర్మ భక్తి జ్ఞాన మర్మము లెరుగక దుర్మతినై పరుల దూర బుట్టితినా!
ధర్మ శాస్త్రము దారి జనియేడి కర్మజుల భక్తులను జ్ఞానుల నమ్మజాలన్ నాదు పూర్వపు కర్మమేమొ తెలియదికనే!!ఎందుకీ!!

౨.ఆశ నాకున్నది ఆకాశమంతా లేశమైనను తృప్తి లేదెపుడు చింతా భూసురుడనై హీన మానవ దాస దాసుడనౌచు నుదరము కోసమై శునకంబు వలెనే గాసి జెందుచు తిరుగుచున్నా!!ఎందుకీ!!

౩.పుట్టింపమని వేడుకొంటినా నే పుట్టి సుఖమేమైనా గంటినా
సృష్టిలో నావంటి దుష్టుని సృష్టి జేయగనేల జానెడు పొట్ట బెట్టగనేల లోకులు తిట్టనేర్చుట కేల గానిచో!!ఎందుకీ!

౪.నోరెండనేనడుగ స్థిర బీజ పురములో కూరుచుంటివి చిత్ర కూటంబులో బాగా వేరే దిక్కికలేరె దెల్పవె శ్రీరమా ధవ రామ రాఘవ నారసింహుడ నీదు దాసుడనంటి చివరకు మూఢమతినై!!ఎందుకీ!!

Friday, June 22, 2012

మాయామాళవ గౌళ ::: రాగం































మాయామాళవ గౌళ ::: రాగం
దేశాది :: తాళం


15 maayamaaLava gowLa mela
Aa: S R1 G3 M1 P D1 N3 S
Av: S N3 D1 P M1 G3 R1 S

పల్లవి::


మేరు సమాన ధీర వరద రఘు
వీర జూతాము రారా మహా

మేరు సమాన ధీర వరద రఘు
వీర జూతాము రారా మహా

అనుపల్లవి::

1సార-సార ఒయ్యారపు నడలను
నీరద కాంతిని నీ ఠీవిని మహా

మేరు సమాన ధీర వరద రఘు
వీర జూతాము రారా మహా


చరణం::1

అలకల ముద్దును తిలకపు తీరును
తళుకు చెక్కులచే తనరు నెమ్మోమును
గళమున శోభిల్లు కనక భూషణముల
దళిత దుర్-మానవ త్యాగరాజార్చిత

మేరు సమాన ధీర వరద రఘు
వీర జూతాము రారా మహా

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

maayaamaaLava gauLa ::: raagaM
daeSaadi :: taaLaM


15 maayamaaLava gowLa mela
Aa: S R1 G3 M1 P D1 N3 S
Av: S N3 D1 P M1 G3 R1 S

pallavi::

maeru samaana dheera varada raghu
veera jootaamu raaraa mahaa

maeru samaana dheera varada raghu
veera jootaamu raaraa mahaa

anupallavi::

1saara-saara oyyaarapu naDalanu
neerada kaaMtini nee Theevini mahaa

maeru samaana dheera varada raghu
veera jootaamu raaraa mahaa

charaNaM::1

alakala muddunu tilakapu teerunu
taLuku chekkulachae tanaru nemmOmunu
gaLamuna SObhillu kanaka bhooshaNamula
daLita dur^-maanava tyaagaraajaarchita

maeru samaana dheera varada raghu
veera jootaamu raaraa mahaa

Sunday, June 17, 2012

సౌరాష్ట్ర::రాగం







రూపక::తాళం
Composer:::పోన్నైయ పిళ్ళై,

17 sooryakaantam janya
Aa:: S R1 G3 M1 P M1 D2 N3 S
Av:: S N3 D2 N2 D2 P M1 G3 R1 S

పల్లవి::
రంగనాథుడే అంతరంగనాథుడే

అనుపల్లవి::1
మంగళప్రదంబులిచ్చు మహాదేవునిసఖుడే

చరణాలు::1

సతతము వానినామమే సంకీర్తనములు జేసిన
జనుల హృదయ కమలమందు మెలగుచునున్నాడే
పతితపావన బిరుదింక పట్టియున్నాడే
సద్గతియిచ్చువాడితడే గరుడగమనదొర ఇతడే

చరణం::2

పదహారువేల స్త్రీలకు ప్రాణనాథుడితడే
పరశురామ గర్వమేల్ల భంగపరచినాడే
ముదము మీర పాండవులకు మోక్షమిచ్చినాడే
పరమ దయా కరుడే శ్రీ ప్రహ్లాద వరదుడే

ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ

17 sooryakaantam janya
Aa: S R1 G3 M1 P M1 D2 N3 S
Av: S N3 D2 N2 D2 P M1 G3 R1 S

taaLam: roopakam
Composer: Ponniah PiLLai
Language: Sanskrit

pallavi

ranganAthuDE antaranga nAthuDE

anupallavi

mangLapratambu liccu mahAdEvuni sakhuDE

caraNam 1

satatamu vAni nAmamE sankIrtanamulu jEsina janula hrday kamalamandu jelagucununnADE
patita pAvana birudinga baTTiyunnADE sadgati iTTivATidaTE garuDa gamana dorayiDatE

caraNam 2

araviri saruni janakuDe apramEya sakhuDE arasicUTa taramu gAdu anniya mAya paruDE
girini vElpu nitya sUrulamamrta miccinADEyanimoraliDucunu sharaNaNTE mundu nilaci brOcuvADE

caraNam 3

padahAru vEla strIlagu prANanAthuDitaDE parashurAmu garvamella bhanga
paracinADE mudamumIra pANDavulaku mOkSamiccinADE parama dayAkaruDE shrI prahlAda varaduDE

Sunday, June 10, 2012

చక్రవాకం ::రాగం







రాగం:చక్రవాకం

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥

నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥

తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు
కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥

సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥


raagaM:chakravaakaM

chaMdamaama raavO jaabilli raavO
kuMdanapu paiDikOra vennapaalu taevO

nagumOmu chakkanayyaku naluvapuTTiMchina taMDriki
nigamamulaMduMDae appaku maa neelavarNuniki
jagamella aelina svaamiki chakkani iMdira maganiki
muguriki modalaina ghanuniki maamuddula muraari baaluniki

telidammi kannulamaeTiki maMchi tiyyani maaTala gummaku
kalikichaetala kODeku maa katalakaari eebiDDaku
kulamuddariMchina paTTeku maMchi guNamulu kaligina kODeku
niluvella niMDaboyyaariki navanidhula choopula choochaesuguNunaku

suralagaachina daevaraku chuMchu garuDunekkina gabbiki
neravaadi buddula peddaku maa neeTu chaetala paTTiki
virula viMTivaani ayyaku vaevaeluroopula svaamiki
sirimiMchuneravaadi jaaNaku maa Sree vaeMkaTanaadhuniki