Saturday, June 23, 2012

బిలహరి ::: రాగం










రచన:ములుకుట్ల నరసింహావధానులు(రామాయణం శాస్త్రులు) గారు

V. భాగవత ప్రార్ధన:

శ్లో!!ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్!
రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి!!






బిలహరి రాగం...ఆది తాళం

ప:ఎందుకీధర బుట్టి నాడనో నా కెరుగా జెప్పుము నిన్ను వీడను రామ!
అ:ఎందఱో మహానీయులందందు నీ భక్తి డెందమందున జేయ మందుడనై ఇటు!!లెందుకీ!!

౧.కర్మ భక్తి జ్ఞాన మర్మము లెరుగక దుర్మతినై పరుల దూర బుట్టితినా!
ధర్మ శాస్త్రము దారి జనియేడి కర్మజుల భక్తులను జ్ఞానుల నమ్మజాలన్ నాదు పూర్వపు కర్మమేమొ తెలియదికనే!!ఎందుకీ!!

౨.ఆశ నాకున్నది ఆకాశమంతా లేశమైనను తృప్తి లేదెపుడు చింతా భూసురుడనై హీన మానవ దాస దాసుడనౌచు నుదరము కోసమై శునకంబు వలెనే గాసి జెందుచు తిరుగుచున్నా!!ఎందుకీ!!

౩.పుట్టింపమని వేడుకొంటినా నే పుట్టి సుఖమేమైనా గంటినా
సృష్టిలో నావంటి దుష్టుని సృష్టి జేయగనేల జానెడు పొట్ట బెట్టగనేల లోకులు తిట్టనేర్చుట కేల గానిచో!!ఎందుకీ!

౪.నోరెండనేనడుగ స్థిర బీజ పురములో కూరుచుంటివి చిత్ర కూటంబులో బాగా వేరే దిక్కికలేరె దెల్పవె శ్రీరమా ధవ రామ రాఘవ నారసింహుడ నీదు దాసుడనంటి చివరకు మూఢమతినై!!ఎందుకీ!!

No comments: