ఆనంద భైరవి రాగం
త్యాగరాజ కీర్తన
పల్లవి::
క్షీర సాగర విహార అపరిమిత
ఘోర పాతక విదార
క్రూర జన గణ విదూర నిగమ
సంచార సుందర శరీర
చరణం::1
శతమఖాహిత విభంగ శ్రీ రామ
శమన రిపు సన్నుతాంగ
శ్రిత మానవాంతరంగ జనకజా
శృంగార జలజ భృంగ (క్షీ)
చరణం::2
రాజాధి రాజ వేష శ్రీ రామ
రమణీయ కర సు-భూష
రాజ నుత లలిత భాష శ్రీ త్యాగ-
రాజాది భక్త పోష (క్షీ)
No comments:
Post a Comment