Wednesday, January 4, 2012

నాట::::రాగం

వైకుంఠఏకాదశి సందర్భంగ ఈ కీర్తన మీకోసం


















Pallavi::
విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు
వైష్ణవమే సర్వంబును

Charanams::

1.పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ

2.యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే

3.అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే

























viShNuDokkaDE viSwAtmakuDu
vaiShNavamE sarvaMbunu

paramEShThi nEyubrahmAMDasRShThiyu
harunilOni saMhAraSakti
paragaga niMdruniparipAlanamunu
arasichUDa SrIharimahima

yilapaMchabhUtamulalO guNamulu
ala navagrahavihAramulu
talakonu kAlatrayadharMAmbunu
alaraga nArAyaNunimahimalE

aMtaTa galamAyAvilAsamulu
poMta paramapadabhOgamulu
maMtukunekkinamarisamastamunu
yiMtayu SrIvEMkaTESumahimalE

No comments: