!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
శ్రీ గణపతి శచ్చిదానంద స్వామి రచన
శ్రీపాదపినాకపాణి స్వరరచన
మల్లాదివారి గాత్రంలో
శంభుని కరుణవు నీవమ్మా జనని
జగముల ఆయుసు నీవమ్మా
సింహపు జూల శివుజడలు
మెత్తని కుచ్చులు నీ కురులు
ఫెళఫెళ నవ్వుల మొరకతడు
విరిసిన వెన్నెల నీనవ్వు
ప్రళయ మహోగ్రపు శివునెడద
నీయెద మెత్తని పూరేకు
యెముకలగూడ శివు గుండియ
నీవురము పొంగేటి పాలవెల్లి
ఆ కళ్ళు మూడగ్ని గుండాలు
నీ కళ్ళలో ప్రేమ పొంగారు
ఆ ఫాలమే క్రోధ సంలగ్నము
నీ నుదురు అరచందురుని నేస్తము
ప్రళయార్భటీ ఘోర మా తాండవం
రసరమ్య శుచిహేల నీ నృత్యము
ఉగ్రత్వ మాస్వామి ఉల్లాసము
వాత్సల్యమే నీకు పరమార్థము
నీవాయనను విడబోవు
నినువీడి ఆయన మనలేడు
మీయిద్దరిదివ్యసంయోగమే
లోకాల బ్రతికించు సచ్చిదానందము
No comments:
Post a Comment