Friday, March 30, 2012

రాగం జోన్‌పురి::తాళం::రూపక









రాగం జోన్‌పురి
తాళం::రూపక

ప్రయాగ రంగదాసు వారి కృతి

రాముడుద్భవించినాడు రఘుకులంబునా
రాముడుద్భవించినాడు రఘుకులంబునా
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా
తామసులను దునిమి దివిజ..
సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా

తనరు చైత్ర శుధ్ధ నవమి పునర్వసందునా
సరస కర్కాటక లగ్నమరయగ..
సురవరులెల విని కురియింపగ విరుల వాన
రాముడుద్భవించినాడు రఘుకులంబునా

దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయ మారుతములు..
దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప
రాముడుద్భవించినాడు రఘుకులంబునా

ధరను కుడిమి లంక పురమును అరసి బ్రోవగా
కరుణతో శ్రీరంగదాసు మొరలిడగను
కరుణుంచియు వరమివ్వగ స్థిరుడై

శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా
తామసులను దునిమి దివిజ..
సోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు
శ్రీరాముడుద్భవించినాడు రఘుకులంబునా

1 comment:

J s sastry, kakinada said...

ఇది జంఝోటి రాగం. జోన్పురి కాదు