Thursday, May 10, 2012

ఆరభి::రాగం




29వ.శంకరభరనం::మేళకర్త

Arohana:::S R2 M1 P D2 S || S Ri Ma Pa Dhi S
Avarohana::S N2 D2 P M1 G2 R2 S || S Nu Dhi Pa Ma Gu Ri S

జీవస్వరం:::R, M, D

పల్లవి::

ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి

చరణం::1

పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ

చరణం::2

వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ

చరణం::3

అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ

No comments: