Friday, May 2, 2014

ఆనందభైరవి::రాగం


 ఆనందభైరవి::ఆది తాళా

పల్లవి::

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

అనుపల్లవి::

కుమార జనని సమానమెవరిలను
మానవతి శ్రీ బృహన్నాయకీ 

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

చరణం::1

సరోజ ముఖి బిరాన నీవు 
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్ర నుత పురాణి
పరాముఖమేలనే తల్లి 

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

చరణం::2

ఉమా హంస గమనా తామసమా
బ్రోవ దిక్కెవరు నిక్కముగను
మాకిపుడభిమానము చూప 
భారమా వినుమా దయతోను

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

చరణం::3

సదా నత వర దాయకీ నిజ 
దాసుడను శ్యామ కృష్ణ సోదరి
గదా మొర వినవా దురిత 
విదారిణీ శ్రీ బృహన్నాయకీ 

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

No comments: