Wednesday, September 19, 2012

బంగాళ :: రాగం




గిరిరాజసుతాతనయ
రాగం::బంగాళ
తాళం::దేశాది
త్యాగయ్య కీర్తన
గాత్రం::శంకర్‌మహాదేవన్

పల్లవి::

గిరిరాజసుతాతనయ సదయ
గిరిరాజసుతాతనయ సదయ

అనుపల్లవి::

సురనాధముఖార్చిత పాదయుగ
పరిపాలయమాం ఇభరాజముఖ
గిరిరాజసుతాతనయ సదయ

చరణం::

గణనాధ పరాత్పర శంకరా
గమవారినిధి రజనీకరా
ఫణిరాజకంకణ విఘ్ననివారణ
శాంభవ శ్రీ త్యాగరాజనుత
గిరిరాజసుతాతనయ సదయ

raagam::bangaaLa
taaLam::daeSaadi
tyaagayya keertana
gaatram::Samkar^mahadaevan


pallavi::

giriraajasutaatanaya sadaya
giriraajasutaatanaya sadaya

anupallavi::

suranaadhamukhaarchita paadayuga
paripaalayamaam ibharaajamukha
giriraajasutaatanaya sadaya

charaNam::

gaNanaadha paraatpara Sankaraa
gamavaarinidhi rajaneekaraa
phaNiraajakankaNa vighnanivaaraNa
Saambhava Sree tyaagaraajanuta
giriraajasutaatanaya sadaya

Monday, September 17, 2012

M.S.సుబ్బులక్ష్మిగారి జయంతి.












జన్మ నామం మధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి
జననం సెప్టెంబర్ 16, 1916
మదురై,తమిళనాడు రాష్ట్రం
మరణం డిసెంబర్ 11, 2004
చెన్నై, తమిళనాడు రాష్ట్రం
ఊపిరితిత్తుల న్యుమోనియా,
హృదయ సంబంధ సమస్యలతో[1]
నివాసం చెన్నై, తమిళనాడు
వృత్తి కర్నాటక సంగీత గాయకురాలు/నాయకురాలు
మరియు
నటి
మతం హిందూ
భార్య/భర్త త్యాగరాజన్ సదాశివన్
సంతానం లేరు
తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్
తల్లి షణ్ముఖవడివు అమ్మల్


సంతకము



ఆమె పాడకపోతే దేవుళ్ళక్కూడా తెల్లవారదు!?
ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన ఏ పల్లే లేవదు !?
తన సుప్రభాత గీతంతో భగవంతుణ్ణి నిదురలేపే ఆ సంగీత ఆధ్యాత్మిక స్వరం ఆమెకు ఒక వరం.
" కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్ .....
.....అంటూ సాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం తెలుగువాడి గుండెల్లో భక్తిభావాల్ని కలిగిస్తుంది. ఆమె పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా వుంటుంది. అభిమానులు ప్రేమగా ఎం.ఎస్ అని పిలిచుకొనే
మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి
దేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్న[2] పురస్కారం అందుకున్న గాయకురాలుగా చరిత్ర సృష్టించి ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు.ప్రపంచం లో ఎవరైనా ఒకవేళ భారతీయుల సాంప్రదాయ వస్త్రధారణ ఎలా వుంటుందని అడిగితే ఒక్క మాటలో చెప్పగలిగే సమాధానమే ఎమ్మెస్. నేను 'ఎమ్మెస్ సుబ్బ లక్ష్మి'కి సమకాలీకుడనని చెబితే యముడు 'నువ్వు సకల స్తోత్రాలూ,మంత్రాలూ,కవచాలూ,సుప్రభాతాలూ..,అన్నీ వినే వుంటావు.ఇక నీకిక్కడ పని ఏమిటి స్వర్గానికి పో అంటాడు.మాతాతయ్య గాంధీని చూసానని చెప్పేవారు.నేను నా మనుమలకు ఎమ్మెస్ ని చూసానని గొప్పగా చెప్పుకొంటాను.పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి 'నాహం కర్తాః-హరిః కర్తాః'అనే పుస్తకం చదివితే,ఆమెపై గౌరవం మరింత పెరుగుతుంది.

బాల్యము::

తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ , ప్రముఖ వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మల్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బలక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఙిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి. కోసం 'ఆల్బమ్ ' అందించింది

జీవితం::

సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నై కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్ , స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది.
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గురించి వీడియో, అడియో పరిచయం యూట్యూబ్.లింక్[3]




ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం::::

సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ' వైష్ణవ జనతో....' జె పీర్ పరాయీ జానేరే......' వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. అమె కంఠం అత్యంత మధురం. భజనపాడుతూ అందులొనే అమె పరవశురాలవుతారు. ప్రార్ధన సమయములొ ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలొ లీనవడం వేరు అని మహాత్మా గాంధీ అన్నారు అంటే, సుబ్బలక్ష్మి సంగీతములొని మాదుర్యపు ప్రభావం, సారాంశం ఏమిటో అర్థం చేసికోవచ్చు!
ఐక్య రాజ్య సమితి లో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్ లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది.





M.S.సుబ్బలక్ష్మి గారి జయంతి

స్వరరాగ గంగా ప్రవాహం
కౌసల్యా సుప్రజా రామా... అని ఆ గళం నుండి సుప్రభాతం వినకపోతే కలియుగ దైవం వెంకటేశ్వరుడికే తెల్లవారదు. ఆమె పాటలు వింటుంటే మనసు తేలికవుతుంది. తెలియకుండానే భక్తి భావం కలుగుతుంది. ఆ దివ్యమంగళ రూపం చూస్తే చాలు రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది.
ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంట!
అవును... 'MS.అమ్మా' అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే మదురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి. ఈ రోజు'MS . సుబ్బలక్ష్మి గారి జయంతి.



1916 సెప్టెంబర్ 16న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో సుబ్రహ్మణ్య అయ్యర్, షణ్ముఖవడిపు అమ్మల్ దంపతులకు ఆమె జన్మించారు. చిన్నపటినుంచే సంగీతమంటే ఆసక్తి ఉండడంతో దానిలో శిక్షణ పొంది 1933 లో మద్రాస్ సంగీత అకాడమీలో మొదటి సంగీత కచేరి ఇచ్చారు. అలా మొదలైన ఆమె సంగీత ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఐరాసలో పాడినా, బ్రిటన్ రాణిని తన గాన మాధుర్యంతో తన్మయురాలిని చేసినా అది ఆవిడకే చెల్లింది. అంతేకాదు... దేశంలోనే అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న, ఇందిరా జాతీయ సమైక్యతా అవార్డు, ఢిల్లీ ప్రభుత్వంచే జీవిత సాఫల్య పురస్కారం, రామన్‌ మెగసెసే పురస్కారం, పలు విశ్వవిద్యాలయాలచే డాక్టరేట్‌లు ఆమెను వరించాయి.
ఇలా కొన్ని దశాబ్దాలపాటు ఈ ధరణీతలాన్ని భక్తి భావనను, పవిత్ర సుమగంధాలను వెదజల్లి పులకింపజేసిన కర్నాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న ఆగిపోయింది.
భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె గళం ఈ ఇలాతలంపై వినపడుతున్నంతకాలం ఆ స్వరరాగ గంగా ప్రవాహం సాగుతూనే ఉంటుంది..



ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[1] కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది.


ఈ ఆణిముత్యాలు...వీ కీ పీడియా ... ప్రణవనాదం నుండి సేకరించినవి

Sunday, September 16, 2012

M.S.సుబ్బులక్ష్మిగారి జయంతి.
























ఈరోజు గాయని పద్మభూషణ్ ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి జయంతి. సుబ్బులక్ష్మీ ఫౌండేషన్ వారు ప్రచురించిన (2006) స్మృతి కవిత పుస్తకంలో
డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం,తనికెళ్ళ భరణి,డాక్టరెల్.కె.సుధాకర్ లాంటి ప్రముఖుల కవితలతో బాటు నేను వ్రాసిన కవితకూ చోటు దొరికింది. M.v. Appa Rao
<><><><><><><><><><><><><><><><>
గాన సరస్వతి
యం.యస్.సుబ్భులక్ష్మి!

నేడు అమృతం సేవించిన దేవతలకు
గానామృతం పంచుతున్నది !!
గాన సరస్వతి ముక్కెర మెరుపులతో
నింగిలోని తారల తళకులు మసక బారాయి !
నిన్నటిదాకా పుణ్యాత్ముల నెలవు కాదు స్వర్గం-
ఆమె రాకతో స్వర్గమే పుణ్యం చేసుకున్నది !

పాడి::రాగం








పాడి :: రాగం

పల్లవి::
ముద్దులు మోమున ముంచగను
నిద్దపు కూరిమి నించీని

చరణం::1
మొలచిరుగంటలు మువ్వలు గజ్జెలు
గలగలమనగా కదలగను
ఎలనవ్వులతో ఈతడు వచ్చి
జలజపు చేతులు చాచీనీ

చరణం::2
అచ్చపు గుచ్చు ముత్యాల హారములు
పచ్చల చంద్రాభరణములు
తచ్చిన చేతుల తానె దైవమని
అచ్చట నిచ్చట ఆడీని

చరణం::
బాలుడు కృష్ణుడు పరమపురుషుడు
నేలకు నింగికి నెరి పొడవై
చాల వేంకటాచలపతి తానై
మేలిమి చేతల మించీని


paaDi :: raagaM

pallavi::
muddulu mOmuna muMchaganu
niddapu koorimi niMcheeni

charaNaM::1
molachirugaMTalu muvvalu gajjelu
galagalamanagaa kadalaganu
elanavvulatO eetaDu vachchi
jalajapu chaetulu chaacheenee

charaNaM::2
achchapu guchchu mutyaala haaramulu
pachchala chaMdraabharaNamulu
tachchina chaetula taane daivamani
achchaTa nichchaTa aaDeeni

charaNaM::
baaluDu kRshNuDu paramapurushuDu
naelaku niMgiki neri poDavai
chaala vaeMkaTaachalapati taanai
maelimi chaetala miMcheeni

దేవగాంధారి:::రాగం







దేవగాంధారి:::రాగం

పల్లవి::
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు

చరణం::1
వెన్నలారగించ బోయి వీధులలో దిరిగీనో
యెన్నరాని యమునలో యీదులాడేనో
సన్నల సాందీపనితో చదువగ బోయినాడో
చిన్నవాడాకలి గొనె చెలులాల యిపుడు

చరణం::2
మగువల కాగిళ్ళ మరచి నిద్దిరించీనో
సొగిసి యావుల గాచే చోట నున్నాడో
యెగువ నుట్లకెక్కి యింతులకు జిక్కినాడో
సగము వేడికూరలు చల్లనాయ నిపుడు

చరణం::3
చెంది నెమలి చుంగుల సింగారించుకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాడో
అందపు శ్రీవేంకటేశు డాడివచ్చె నిదె వీడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు


daevagaaMdhaari:::raagaM

pallavi::
piluvarae kRshNuni paerukoni yiMtaTaanu
polasi yaaragiMchae poddaaya nipuDu

charaNaM::1
vennalaaragiMcha bOyi veedhulalO dirigeenO
yennaraani yamunalO yeedulaaDaenO
sannala saaMdeepanitO chaduvaga bOyinaaDO
chinnavaaDaakali gone chelulaala yipuDu

charaNaM::2
maguvala kaagiLLa marachi niddiriMcheenO
sogisi yaavula gaachae chOTa nunnaaDO
yeguva nuTlakekki yiMtulaku jikkinaaDO
sagamu vaeDikooralu challanaaya nipuDu

charaNaM::3
cheMdi nemali chuMgula siMgaariMchukoneenO
iMdunae daevaravale iMTanunnaaDO
aMdapu SreevaeMkaTaeSu DaaDivachche nide veeDe
viMdula maapottuku raa vaeLaaya nipuDu

Saturday, September 15, 2012

బృందావని,మాయామాళవగౌళ :: రాగమాలిక, మిశ్రచాపుతాళం









అన్నమయ్య సంకీర్తనలు
బృందావని,మాయామాళవగౌళ
రాగమాలిక, మిశ్రచాపుతాళం


పల్లవి::


ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు
ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు

అంతరాతరములెంచి చూడ
పిండంతేనిప్పటి అన్నట్లు
అంతరాతరములెంచి చూడ
పిండంతేనిప్పటి అన్నట్లు

ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు

చరణం::1


కొలుతురు మిము వైష్ణవులు
కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు
పరబ్రహ్మంబనుచు
కొలుతురు మిము వైష్ణవులు
కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు
పరబ్రహ్మంబనుచు

తలతురు మిము శైవులు
తగిన భక్తులును శివుడనుచు
తలతురు మిము శైవులు
తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు
కాపాలికులు ఆది భైరవుండనుచు
అలరి పొగడుదురు
కాపాలికులు ఆది భైరవుండనుచు

ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు

చరణం::2


సరి నెన్నుదురు శాక్తేయులు
శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానావిధములను
తలపుల కొలదుల భజింతురు
సరి నెన్నుదురు శాక్తేయులు
శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానావిధములను
తలపుల కొలదుల భజింతురు

సిరుల మిము నే అల్పబుద్ది దలచిన
వారికి అల్పంబవుదువు
గరిమిల మిము నే ఘనమని దలచిన
ఘన బుద్దులకు ఘనుడవు
నీ వలన కొరతే లేదు
మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల
ఆ జలమే ఊరినయట్లు
నీ వలన కొరతే లేదు
మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల
ఆ జలమే ఊరినయట్లు

శ్రీ వేంకటపతి నీవైతే
మము చేకొని ఉన్నా దైవము
శ్రీ వేంకటపతి నీవైతే
మము చేకొని ఉన్నా దైవమని
ఈవల నే నీ శరణననెదను
ఇదియే పర తత్త్వము నాకు
ఇదియే పర తత్త్వము నాకు
ఇదియే పర తత్త్వము నాకు

శ్రీ::రాగం








శ్రీ ::రాగం

పల్లవి::


తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు

చరణం::1
తిరుదండెల పై నేగీ దేవు డిదే తొలినాడు
సిరులు రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద
పొరి నాలుగోనాడు పువ్వుకోవిల లోను
తిరువీధుల మెరసీ దేవదేవుడు

చరణం::2
గక్కన ఐదవనాడు గరుడుని మీద
ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ తేరును గుర్ర మెనిమిదో నాడు
తిరువీధుల మెరసీ దేవదేవుడు

చరణం::3
కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లి పీట
ఎనసి శ్రీ వేంకటేశు డింతి అలమేల్మంగతో
వనితల నడుమను వాహనాల మీదను
తిరువీధుల మెరసీ దేవదేవుడు

Monday, September 10, 2012

రేవతి::రాగం




రేవతి ::: రాగం
ఆది :: తాళం

2 ratnaangi janya
Aa: S R1 M1 P N2 S
Av: S N2 P M1 R1 S
Composer::Annamaacaarya

అన్నమయ్య సంకీర్తనం

పల్లవి::

నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యమూ ..

చరణం::1

పుట్టుటయు నిజము.. పోవుటయు నిజము ..
నట్ట నడి నీ పని నాటకమూ …
ఎట్తనేడుతనే గలది ప్రపంచమూ ..
కట్టకడపటిదీ కైవల్యమూ ..

చరణం::2

కుడిచే దన్నము, కోక చుట్టెడిది,
నడమంత్రపు పని నాటకము;
ఒడి గట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము

చరణం::3

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువనె శ్రీ వేంకటేశ్వరు డేలిక,
గగనము మీదిది కైవల్యము


raagam :: rEvati
2 ratnaangi janya
Aa:: S R1 M1 P N2 S
Av:: S N2 P M1 R1 S

taaLam :: aadi
Composer::Annamaacaarya


pallavi

nAnATi patuku nATakamu
kAnaka kannati kaivalyamu

caraNam 1

puTTuTayu nijamu pOvuTayu nijamu
naTTa naTimi pani nATakamu
yeTTa neduTagaladI prapaNcamu
kaTTagaTapaTiti kaivalyamu
(naanaaTi)

caraNam 2

kuTicEdannamu Shoka cuTTeDidi
NaTu mantrapu pani nATakamu
voDigaTTu konina vubhayakarmulu
gaTidATinapuDE kaivalyamu
(naanaaTi)

caraNam 3

tekadu pApamu tIradu puNyamu
naki naki kAlamu nATakamu
yevakune ShRI vEngkaTEShvaru Telika
gakhanamu mItiti kaivalyamu
(naanaaTi)

Saturday, September 8, 2012

కాపీ::రాగం










కాపీ రాగం

తాళం::త్రిపుట

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Ni Pa Ma Ga Ri Sa

భద్రాధి రామదాసు కీర్తన::

పల్లవి::

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

చరణములు::

1}ఓనమాలు రాయగానే నీ నామమే తోచు
ఓనమాలు రాయగానే నీ నామమే తోచు
నీ నామమే తోచు శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

2}ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు
ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు
అందమె కానవచ్చు శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

3}ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు
ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు
భక్తి మాత్రమే చాలు శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

4}సత్య స్వరూపమున ప్రత్యక్షమై నావు
సత్య స్వరూపమున ప్రత్యక్షమై నావు
ప్రత్యక్షమై నావు శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

5}ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి
ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి
మునులెల్ల మోహించిరి శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

6}దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో
దృష్టి తాకును ఏమో శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

7}ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే
ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే
నిన్నే భజింప నీవే శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

8}రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా
రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా
నీ తిరువడిగళె కాదా శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

9}నారదాది మునులు పరమపద మందిరిగద
నారదాది మునులు పరమపద మందిరిగద
పరమపద మందిరిగా శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

10}భద్రాచల నివాస పాలిత రామదాస
భద్రాచల నివాస పాలిత రామదాస
పాలిత రామదాస శ్రీరామా...

జానకీ రమణ కల్యాణ సజ్జన..నిపుణ
కల్యాణ సజ్జన నిపుణ...

ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐॐ♥ॐ
kaapee raagaM

taaLaM::tripuTa

Arohana::Sa Ri Ma Pa Ni Sa
Avarohana::Sa Ni Dha Ni Pa Ma Ga Ri Sa

bhadraadhi raamadaasu keertana::

pallavi::

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

charaNamulu::

1}Onamaalu raayagaanae nee naamamae tOchu
Onamaalu raayagaanae nee naamamae tOchu
nee naamamae tOchu Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

2}eMdu joochina needu aMdamae gaanavachchu
eMdu joochina needu aMdamae gaanavachchu
aMdame kaanavachchu Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

3}mukti nae nolla needu bhakti maatramae chaalu
mukti nae nolla needu bhakti maatramae chaalu
bhakti maatramae chaalu Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

4}satya svaroopamuna pratyakshamai naavu
satya svaroopamuna pratyakshamai naavu
pratyakshamai naavu Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

5}muddu mOmunu choochi munulella mOhiMchiri
muddu mOmunu choochi munulella mOhiMchiri
munulella mOhiMchiri Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

6}dushTulu ninujooDa dRshTi taakunu aemO
dRshTi taakunu aemO Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

7}enni janmalettina ninnae bhajiMpa neevae
enni janmalettina ninnae bhajiMpa neevae
ninnae bhajiMpa neevae Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

8}raati naatiga jaese nee tiruvaDigaLe kaadaa
raati naatiga jaese nee tiruvaDigaLe kaadaa
nee tiruvaDigaLe kaadaa Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

9}naaradaadi munulu paramapada maMdirigada
naaradaadi munulu paramapada maMdirigada
paramapada maMdirigaa Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

10}bhadraachala nivaasa paalita raamadaasa
bhadraachala nivaasa paalita raamadaasa
paalita raamadaasa Sreeraamaa...

jaanakee ramaNa kalyaaNa sajjana..nipuNa
kalyaaNa sajjana nipuNa...

Monday, September 3, 2012

సామంతం :: రాగ







సామంతం :: రాగ

పల్లవి::

ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె

చరణం::1

మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు

చరణం::2

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు

చరణం::3

పొంచి అసురకాంతలలో వెదకిన బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||


Lyrics in English:

raagam:: saamantam

pallavi::

itanikaMTE maridaivamu kAnamu yekkaDA vedakina nitaDE
atiSayamagu mahimalatO velasenu anniTikAdhAramutAne

charaNam::1

madijaladhulanokadaivamu vedakina matsyAvatAraMbitaDu
adivO pAtALAmamdu vedakitE AdikUrmamI viShNuDu
podigoni yaDavula vedaki chUchitE bhUvarAhamanikaMTimi
chedaraka koMDala guhala vedakitE SrInarasiMhaMbunnADu

charaNam::2

telisi bhUnabhOMtaramuna vedakina trivikramAkRti nilichinadi
paluvIrulalO vedakichUchitE paraSurAmuDokaDainADU
talapuna SivuDunupArwati vedakina tArakabrahmamurAghavuDu
kelakula nAvulamaMdala vedakina kRShNuDu rAmuDunainAru

charaNam::3

poMchi asurakAMtalalO vedakina budhdhAvatAraMbainADu
miMchina kAlamu kaDapaTa vedakina mIdaTikalkyAvatAramu
aMchela jIvulalOpala vedakina aMtaryAmai merasenu
yeMchuka ihamuna paramuna vedakina yItaDE SrIvEMkaTavibhuDu