Saturday, January 17, 2009

కురింజి :: రాగం













::: Priya Sisters :::

రాగం::కురింజి
29 శంకరాభరణం జన్య
ఆ::స ని3 స రి2 గ3 మ1 ప ద2
అవ::ద2 ప మ1 గ3 రి2 స ని3 స
తాళం::ఆది
రచన::ఆన్నమాచార్య


::పల్లవి::
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు


::చరణం::1


అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
ఛెంతల మాలోనున్న చిన్ని క్రిష్నుడు


::చరణం::2


రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచె కమలాక్షుడు


::చరణం::3


కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏల్లేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
raagam::kurinji
29 SankaraabharaNam janya
A::sa ni3 sa ri2 ga3 ma1 pa da2
ava::da2 pa ma1 ga3 ri2 sa ni3 sa

taaLam::aadi
rachana::Annamaacaarya

::pallavi::
muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
diddarAni mahimala dEvakii sutuDu


::charaNam::1

antaninta golletala arachEti mANikyamu
pantamADE kamsuni pAli vajramu
kAntula mooDu lOkAla garuDapachchapoosa
Chentala mAlOnunna chinni krishnuDu



::charaNam::2

ratikELi rukmiNiki rangumOvi pagaDamu
miti gOvardhanapu gOmEdhikamu
satamai SankhachakrAla sandula vaiDhooryamu
gatiyai mammu gAche kamalAkshuDu



::charaNam::3

kALinguni talalapai kappina pushyarAgamu
EllETi Srii vEnkaTAdri indraneelamu
pAlajalanidhilOna pAyani divya ratnamu
bAluni vale tirigE padmanAbhuDu


muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
tiddarAni mahimala daevakee sutuDu


No comments: