Devi Brova- MS SUBBULAKSHMI-Chintamani
Artist::K.V.నారాయణస్వామి
రాగం: చింతామణి
తాళం: ఆది
Composer::శ్యామ శాస్త్రి
56::శణ్ముగప్రియా జన్య
ఆ::S G2 R2 G2 M2 G2 R2 G2 P M2 P D2 N2 S
అవ::S N2 D2 P M2 G2 R2 S
పల్లవి
దేవి బ్రోవ సమయమిదే
అనుపల్లవి
అతి వేగమే వచ్చి నా వెధలు తీర్చి
కరుణించవే శంకరీ కామాక్షి
చరణం 1
లోక జననీ నాపై దయ లేదా
నీ దాసుడు కాదా శ్రీ కాంచీ విహారిణీ కల్యాణీ
ఏకాంబరేశ్వరుని ప్రియ భామయై యున్న నీకే
మంమ్మా ఎంతో భారమా వినుమా తల్లీ
చరణం 2
శ్యామ క్రిష్ణుని సోదరీ కౌమారి బింభాధరి గౌరీ
హేమాపాంగి లలితే పరదేవత
కామాక్షి నిన్ను వినా భూమిలో ప్రేమతో
కాపాడేవారేవరు ఉన్నారమ్మా నన్ను
కాపాడేవారేవరు ఉన్నారమ్మా తల్లీ
చరణం 3
రేపు మాపని జెపితే నే వినను ఇక తాళను నేను
ఈ ప్రొద్ధు దయసేయవే క్రుప జూడవే
నీ పాదాప్జముల మదిలో సదాఎంచి నీ
ప్రేమ కోరి యున్నా నమ్మ మోథముతో నన్ను
No comments:
Post a Comment