Sunday, August 12, 2012

ఖమాస్::రాగం




















ఖమాస్::రాగం
ఆది..తాళం

పల్లవి::

కొలనిలోన మును గోపికలు
మొలక నవ్వులతో మ్రొక్కిరినీకు

చరణం::1

పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యలులు
అరిది నితంబులందునె దాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు

చరణం::2

నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరినీకు

చరణం::3

పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలచుచు మ్రొక్కిరినీకు

No comments: