యమున్‌కల్యాణి ::: రాగం :: ఆది తాళం
పల్లవి
నంద గోపాల ముకుంద
గోకుల నందన యమునా తీర విహార
అనుపల్లవి
మందర గిరి ధర మామవ మాధవ
మురళీ ధర మధు సూదన హరే
చరణము
మంద హాస వదన మంజుళ చరణ
అరవింద లోచన ఆశ్రిత రక్షణ
పీతాంబర ధర పన్నగ శయన
కలి కల్మష హరణ కరుణా పూరణ
(మధ్యమ కాల సాహిత్యమ్)
వందిత ముని బృంద గురు గుహానంద
వైకుంఠ స్థితానంద కంద
గోవర్ధనోద్ధార గోప స్త్రీ జార గోవింద
No comments:
Post a Comment