Thursday, August 16, 2012

అసావేరి::రాగం
















అసావేరి::రాగం
ఆది తాళం

త్యాగయ్య కృతి

పల్లవి::

రారా మాయింటిదాక రఘు-
వీర సుకుమార మ్రొక్కెదరా

అనుపల్లవి::

రారా దశరథ కుమార నన్నేలు-
కోరా తాళ లేరా (రా)

చరణం::1

కోరిన కోర్కె కొన-సాగకనే
నీరజ నయన నీ దారిని కని
వేసారితి కాని సాధు జనావన
సారి వెడలి సామి నేడైన (రా)

చరణం::2

ప్రొద్దున లేచి పుణ్యము తోటి
బుద్ధులు జెప్పి బ్రోతువు కాని
ముద్దు కారు నీ మోమును జూచుచు
వద్ద నిలిచి వారము పూజించెద (రా)

చరణం::3

దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ
గ్రక్కున రావు కరుణను నీచే
జిక్కియున్నదెల్ల మరతురాయిక
శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రా)

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

asaavaeri::raagaM
aadi taaLaM

tyaagayya kRti

pallavi::

raaraa maayiMTidaaka raghu-
veera sukumaara mrokkedaraa

anupallavi::

raaraa daSaratha kumaara nannaelu-
kOraa taaLa laeraa (raa)

charaNaM::1

kOrina kOrke kona-saagakanae
neeraja nayana nee daarini kani
vaesaariti kaani saadhu janaavana
saari veDali saami naeDaina (raa)

charaNaM::2

prodduna laechi puNyamu tOTi
buddhulu jeppi brOtuvu kaani
muddu kaaru nee mOmunu joochuchu
vadda nilichi vaaramu poojiMcheda (raa)

charaNaM::3

dikku neevanuchu telisi nannu brOva
grakkuna raavu karuNanu neechae
jikkiyunnadella maraturaayika
Sree tyaagaraajuni bhaagyamaa (raa)

No comments: