paata ikkada vinandii
ఖరహరప్రియ :: రాగం
ఓ రామ నీనామ ఏమి రుచిరా
ఓ రామ నీనామ ఏమి రుచిరా
శ్రీరామ నీనామ ఎంత రుచిరా
మధరసములకంటే దధిఘృతములకంటే
అతిరసమగు నామమేమి రుచిరా
నవరస పరమాన్న నవనీతములకంటే
నధికమౌనినామ మేమి రుచిరా
ద్రాక్షఫలముకన్న ఇక్షురసముకన్న
పక్షివాహన నామమేమి రుచిరా
అంజనాతనయ హృత్కంజదలమునందు
రంజిల్లు నీనామమేమి రుచిరా
సదాశివుడు మది సదా భజించేది
సదానందమగు నామమేమి రుచిరా
సారములేని సంసారమునకు సం
తారకమగు నామమేమి రుచిరా
శరణన్న జనముల సరగున రక్షించు
బిరుదు గల్గిన నామమేమి రుచిరా
కరిరాజ ప్రహ్లాద ధరణీజ విభీషణుల
గాచిన నీనామమేమి రుచిరా
కదలీ ఖర్జూర ఫలరసములకధికము
పతిత పావన నీ నామమేమి రుచిరా
తుంబురు నారదులు డంబు మీరగ గా
నంబు జేసేది నామేమి రుచిరా
రామ భద్రాచల ధామ రామ దాసుని
ప్రేమనొలిన నామమేమవి రుచిరా
**********************************************************************************************
kharaharapriya :: raagaM
O raama neenaama aemi ruchiraa
O raama neenaama aemi ruchiraa
Sreeraama neenaama eMta ruchiraa
madharasamulakaMTae dadhighRtamulakaMTae
atirasamagu naamamaemi ruchiraa
navarasa paramaanna navaneetamulakaMTae
nadhikamauninaama maemi ruchiraa
draakshaphalamukanna ikshurasamukanna
pakshivaahana naamamaemi ruchiraa
aMjanaatanaya hRtkaMjadalamunaMdu
raMjillu neenaamamaemi ruchiraa
sadaaSivuDu madi sadaa bhajiMchaedi
sadaanaMdamagu naamamaemi ruchiraa
saaramulaeni saMsaaramunaku saM
taarakamagu naamamaemi ruchiraa
SaraNanna janamula saraguna rakshiMchu
birudu galgina naamamaemi ruchiraa
kariraaja prahlaada dharaNeeja vibheeshaNula
gaachina neenaamamaemi ruchiraa
kadalee kharjoora phalarasamulakadhikamu
patita paavana nee naamamaemi ruchiraa
tuMburu naaradulu DaMbu meeraga gaa
naMbu jaesaedi naamaemi ruchiraa
raama bhadraachala dhaama raama daasuni
praemanolina naamamaemavi ruchiraa
No comments:
Post a Comment