
లలిత రాగం - రూపక తాళం
గానం::శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ
పల్లవి::
సీతమ్మ మాయమ్మ..శ్రీరాముడు మా తండ్రి
అనుపల్లవి::
వాతాత్మజ సౌమిత్రి..వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సో..దరులు మాకు; ఓ మనస !
చరణము:::
పరమేశ వసిష్ఠ పరా..శర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబో..దర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రే..సరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి..పరమ బాంధవులు; మనస !
No comments:
Post a Comment