Saturday, April 7, 2012

బౌళి::రాగం






బౌళి::రాగం

పల్లవి::

దేవుడొక్కడే మఱి జీవులు వేరు
వావాత తెలిసేది వారి వారి భాగ్యము

చరణం::1

పొడమినవారికి పోయినవారికి
గడియలొక్కటే వారిగతులు వేరు
బడి పుణ్యములు సేయ పాపములు సేయగ
కడగి కాల మెక్కటే కర్మములేవేరు

చరణం::2

కాకములు సంచరించె కలహంసలు తిరిగె
ఆకాశమెక్కటే విహారాలు వేరు
మేకొని యెండలు కాయ మించి చీకటులు రాయ
లోకపు బయలొక్కటే జోకలే వేరు

చరణం::3

అట్టే ఏలే రాజులకు నడిగేటి దీనులకు
పట్టి భూమి ఒక్కటే బాగులు వేరు
గుట్టున శ్రీ వేంకటేశు గొలువగ దలచగ
నెట్టిన దేహమెక్కటే నేరుపులే వేరు



bauLi::raagaM

pallavi::

daevuDokkaDae ma~ri jeevulu vaeru
vaavaata telisaedi vaari vaari bhaagyamu

charaNaM::1

poDaminavaariki pOyinavaariki
gaDiyalokkaTae vaarigatulu vaeru
baDi puNyamulu saeya paapamulu saeyaga
kaDagi kaala mekkaTae karmamulaevaeru

charaNaM::2

kaakamulu saMchariMche kalahaMsalu tirige
aakaaSamekkaTae vihaaraalu vaeru
maekoni yeMDalu kaaya miMchi cheekaTulu raaya
lOkapu bayalokkaTae jOkalae vaeru

charaNaM::3

aTTae aelae raajulaku naDigaeTi deenulaku
paTTi bhoomi okkaTae baagulu vaeru
guTTuna Sree vaeMkaTaeSu goluvaga dalachaga
neTTina daehamekkaTae naerupulae vaeru

No comments: