Tuesday, April 17, 2012

మేలుకో శ్రీరామ మేఘసుశ్యామ







పల్లవి::

మేలుకో శ్రీరామ మేఘసుశ్యామ
మేలుకో భద్రగిరి నేలుకో రామ
మా వేదమంత్రమా మా ఆదికావ్యమా
మా నిషాదాచ్చరి వాల్మీకి శ్లోకమా

మేలుకో శ్రీరామ మేఘసుశ్యామ..ఆ..ఆ

చరణం::1

అరుణరవి బింబమే అవనిజా ముఖపద్మ
కుంకమై మెరిసేను మేలుకో రామ
నవమి పుఃకోకిలలు నారదాది మునీంద్ర
మహతులై పలికేను మేలుకో రామ
అడవి దారుల వచ్చె శబరి
పొడలిపొంగలు ఆరె గౌతమి
కడలి నీవని తలచి కడ దిక్కుగా వలచి

మేలుకో శ్రీరామ మేఘసుశ్యామ
మేలుకో భద్రగిరి నేలుకో రామ
మా వేదమంత్రమా మా ఆదికావ్యమా
మా నిషాదాచ్చరి వాల్మీకి శ్లోకమా

చరణం::2

కంచెర్ల గోపన్న కమనీయ గానాలు
చల్లగా చెవి సోకి తెల్లవారే వేళ
కావేరి తీరాన కనలేని త్యాగయ్య
రామదాసుని పాట తాను పాడే వేళ
పదము పట్టెను వాయుసుతుడు
పడవ ముంగిట నిలిపె గుహుడు
రవివంశ జాతమా రవివి నీవని తలచి

// మేలుకో //

pallavi::

mElukO SrIrAma mEghasuSyAma
mElukO bhadragiri nElukO rAma
mA vEdamaMtramA mA AdikAvyamA
mA niShAdAchchari vAlmIki SlOkamA

// pallavi //

charaNam::1

aruNaravi biMbamE avanijA mukhapadma
kaMkumai merisEnu mElukO rAma
navami puHkOkilalu nAradAdi munIMdra
mahatulai palikEnu mElukO rAma
aDavi dArula vachche sabari
poDalipoMgulu Are gautami
kaDali nIvani talachi kaDa dikkugA valachi

mElukO SrIrAma mEghasuSyAma
mElukO bhadragiri nElukO rAma
mA vEdamaMtramA mA AdikAvyamA
mA niShAdAchchari vAlmIki SlOkamA

charaNam::2

kaMcherla gOpanna kamanIya gAnAlu
challagA chevi sOki tellavArE vEla
kAvEri tIrAna kanalEni tyAgayya
rAmadAsuni pATa tAnu pADE vELa
padamu paTTenu vAyusutuDu
paDava muMgiTa nilipe guhuDu
ravivaMSa jAtamA ravivi nIvani talachi

mElukO SrIrAma mEghasuSyAma
mElukO bhadragiri nElukO rAma
mA vEdamaMtramA mA AdikAvyamA
mA niShAdAchchari vAlmIki SlOkamA

No comments: