ఆనందభైరవి రాగం
పల్లవి::
రావయ్య భద్రాచలధామా శ్రీరామా
రమణీయ జగదభిరామ లలామా
అనుపల్లవి::
కేవల భక్తి విలసిల్లునా విలసిల్లగా
భావము తెలిసిన దేవుడవైతే
చరణం::1
ప్రొద్దున నిను పొగడుచు నెల్లప్పుడు
పద్దుమీరకును పద్దుమీ రగను భజనలు చేసెద
గద్దరితనమున ప్రొదులు పుచ్చక/పుచ్చుచు
ముద్దులు కులుకుచు మునుపటివలె (నిటు)
చరణం::2
నన్నుగన్న తండ్రీ (నా) మదిలో(న) నీ-
కన్న నితరులను కొలిచెదనా ఆ-పన్నరక్షకా
వర దినకర కుల [శ్రీకర దివ్య ప్రభాకర పుర]-
రత్నాకర పూర్ణ సుధాకర ||
చరణం::3
అంజలి చేసెద నరమర లేక
కంజదళాక్ష కటాక్షము లుంచము
ముజ్జగములకును ముదమిడు పదముల
గజ్జెలు కదలగ ఘల్లు ఘల్లుమన
చరణం::4
దోషము లెంచని దొరవని నీకు
దోసలి యొగ్గితి తొలుత పరాకు
దాసుని తప్పులు దండముతో సరి/దీరు
వాసిగ రామదాసు నిక బ్రోవగా
.•♥•.¸ૐ•♥•.•♥•.¸ૐ•♥•...•♥•.¸ૐ•♥•..•♥•.¸ૐ•♥•..•♥•.¸ૐ•♥•.
aanaMdabhairavi ::: raagaM
pallavi::
raavayya bhadraachaladhaamaa Sreeraamaa
ramaNeeya jagadabhiraama lalaamaa
anupallavi::
kaevala bhakti vilasillunaa vilasillagaa
bhaavamu telisina daevuDavaitae
charaNaM::1
prodduna ninu pogaDuchu nellappuDu
paddumeerakunu paddumee raganu bhajanalu chaeseda
gaddaritanamuna produlu puchchaka/puchchuchu
muddulu kulukuchu munupaTivale (niTu)
charaNaM::2
nannuganna taMDree (naa) madilO(na) nee-
kanna nitarulanu kolichedanaa aa-pannarakshakaa
vara dinakara kula [Sreekara divya prabhaakara pura]-
ratnaakara poorNa sudhaakara ||
charaNaM::3
aMjali chaeseda naramara laeka
kaMjadaLaaksha kaTaakshamu luMchamu
mujjagamulakunu mudamiDu padamula
gajjelu kadalaga ghallu ghallumana
charaNaM::4
dOshamu leMchani doravani neeku
dOsali yoggiti toluta paraaku
daasuni tappulu daMDamutO sari/deeru
vaasiga raamadaasu nika brOvagaa
No comments:
Post a Comment