Monday, April 16, 2012

భౌళి::::రాగం ::: జంప తాళం



భౌళి::::రాగం
తాళం::జంప తాళం
రచన::త్యాగరాజ స్వామి,

పల్లవి
మేలుకోవయ్య మమ్మేలుకో రామ
మేలైన సీతా సమేత నా భాగ్యమా

చరణాలు
1.నారదాదులు నిన్ను కోరి నీ మహిమ
లవ్వారిగా పాడుచున్నారిపుడు తెల్ల-
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత
క్షీరములు బాగుగానారగింపను వేగ

మేలుకోవయ్య మమ్మేలుకో రామ
మేలైన సీతా సమేత నా భాగ్యమా

2.ఫణి శయన అనిమిష రమణులూడిగము సేయ
అణుకువగ నిండారు ప్రణుతి జేసెదరు
మణి-మయాభరణులౌ అణిమాదులిడు దీప
మణులు తెలుపాయెను తరణి వంశ వర తిలక

మేలుకోవయ్య మమ్మేలుకో రామ
మేలైన సీతా సమేత నా భాగ్యమా

3.రాజ రాజేశ్వర భ-రాజ ముఖ సాకేత
రాజ సద్గుణ త్యాగరాజ నుత చరణ
రాజన్య విబుధ గణ రాజాదులెల్ల నిను
పూజింప కాచినారీ జగము పాలింప

మేలుకోవయ్య మమ్మేలుకో రామ
మేలైన సీతా సమేత నా భాగ్యమా

************************************************************************************************

bhauLi::::raagaM
taaLaM::jaMpa taaLaM
rachana::tyaagaraaja svaami,

pallavi
maelukOvayya mammaelukO raama
maelaina seetaa samaeta naa bhaagyamaa

charaNaalu
1.naaradaadulu ninnu kOri nee mahima
lavvaarigaa paaDuchunnaaripuDu tella-
vaaragaa vachchinadi Sree raama navaneeta
ksheeramulu baagugaanaaragiMpanu vaega

maelukOvayya mammaelukO raama
maelaina seetaa samaeta naa bhaagyamaa

2.phaNi Sayana animisha ramaNulooDigamu saeya
aNukuvaga niMDaaru praNuti jaesedaru
maNi-mayaabharaNulau aNimaaduliDu deepa
maNulu telupaayenu taraNi vaMSa vara tilaka

maelukOvayya mammaelukO raama
maelaina seetaa samaeta naa bhaagyamaa

3.raaja raajaeSvara bha-raaja mukha saakaeta
raaja sadguNa tyaagaraaja nuta charaNa
raajanya vibudha gaNa raajaadulella ninu
poojiMpa kaachinaaree jagamu paaliMpa

maelukOvayya mammaelukO raama
maelaina seetaa samaeta naa bhaagyamaa

No comments: