Monday, April 16, 2012

కేదార ::: రాగం




Itu Garudani by Venumadhav S

కేదార ::: రాగం

పల్లవి::
ఇటు గరుడని నీ వెక్కినను
పటపట దిక్కులు బగ్గన బగిలె ||

చరణం::1
ఎగసినగరుడని యేపున 'థా' యని
జిగిదొలక చబుకుచేసినను
నిగమాంతంబుల నిగమసంఘములు
గగనము జగములు గడగడ వడకె ||


చరణం::2
బిరుసుగ గరుడని పేరము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరస నఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిరదిర దిరిగె ||


చరణం::3
పల్లించిన నీ పసిడి గరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీ మహిమ
వెళ్లి మునుగుదురు వెంకటరమణా ||

వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన ఉత్సవం గరుడోత్సవం! గరుడసేవా సంకీర్తన ఇది. స్వామి వారి గరుత్మంతునిపై ఎక్కి శౌర్య, పరాక్రమాలతో విహరిస్తూంటే ఆ ప్రతాపానికి దిక్కులు పిక్కటిల్లాయట! లోకాలన్నీ గడగడ వణికాయట! రాక్షస సమూహమంతా భయకంపితమై పారిపోయినదట. వేంకటరమణా! ఇది నీ శౌర్యప్రతాపాలకు చిహ్నము అంటున్నారు ఆచార్యుల వారు.

విశేషం : స్వామి వారిని గరుడోత్సవం రోజున దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

kEdaara ::: raagam

pallavi::
iTu garuDani nee vekkinanu
paTapaTa dikkulu baggana bagile ||

charaNam::1
egasinagaruDani yaepuna 'thaa' yani
jigidolaka chabukuchaesinanu
nigamaaMtaMbula nigamasaMghamulu
gaganamu jagamulu gaDagaDa vaDake ||


charaNam::2
birusuga garuDani paeramu dOluchu
berasi neevu kOpiMchinanu
sarasa nakhilamulu jarjaritamulai
tirupuna nalugaDa diradira dirige ||


charaNam::3
palliMchina nee pasiDi garuDanini
kelluna nee vekkinayapuDu
jhallane raakshasasamiti nee mahima
veLli munuguduru veMkaTaramaNaa ||

vaeMkaTaeSvarasvaami vaari brahmOtsavaalalO mukhyamaina utsavaM garuDOtsavaM! garuDasaevaa saMkeertana idi. svaami vaari garutmaMtunipai ekki Saurya, paraakramaalatO viharistooMTae aa prataapaaniki dikkulu pikkaTillaayaTa! lOkaalannee gaDagaDa vaNikaayaTa! raakshasa samoohamaMtaa bhayakaMpitamai paaripOyinadaTa. vaeMkaTaramaNaa! idi nee Sauryaprataapaalaku chihnamu aMTunnaaru aachaaryula vaaru.

viSaeshaM : svaami vaarini garuDOtsavaM rOjuna darSanaM chaesukuMTae punarjanma uMDadani prateeti.

No comments: