Saturday, April 7, 2012

పాడి::రాగం






పాడి::రాగం

పల్లవి::

సుగ్రీవ నారసింహుని చూడరో వాడె
అగ్రపూజ గొన్నవాడు ఆది సింహము

చరణం::1

దేవతలు జయవెట్టి దివినుండి పొగడగ
దేవులతో కూడున్నాడు దివ్యసింహము
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుడుండగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము

చరణం::2

అసురలను గెలిచి అదె సింహాసనముపై
వెస గొలువున్నాడు వీరసింహము
పసిడి వర్ణముతోడ బహుదివ్యాయిధాలతో
దెసల వెలుగొందీని ధీరసింహము

చరణం::3

నానాభరణాలు వెట్టీ నమ్మిన దాసుల నెల్ల
ఆనుకొని రక్షించీ ప్రత్యక్షసింహము
పూని శ్రీ వేంకటాద్రిని బుదులెల్లా కొలువగా
నానా వరములొసని మానవ సింహము


paaDi::raagaM

pallavi::

sugreeva naarasiMhuni chooDarO vaaDe
agrapooja gonnavaaDu aadi siMhamu

charaNaM::1

daevatalu jayaveTTi divinuMDi pogaDaga
daevulatO kooDunnaaDu divyasiMhamu
bhaaviMpa neTTaneduTa prahlaaduDuMDagaanu
vaevaelu navvulu navvee vijayasiMhamu

charaNaM::2

asuralanu gelichi ade siMhaasanamupai
vesa goluvunnaaDu veerasiMhamu
pasiDi varNamutODa bahudivyaayidhaalatO
desala velugoMdeeni dheerasiMhamu

charaNaM::3

naanaabharaNaalu veTTee nammina daasula nella
aanukoni rakshiMchee pratyakshasiMhamu
pooni Sree vaeMkaTaadrini budulellaa koluvagaa
naanaa varamulosani maanava siMhamu

No comments: