Sunday, October 12, 2014

శుద్ధధన్యాసి::రాగం




  
ఆది::తాళం

ఖరహరప్రియ జన్యం

ఆరో::స గ2 మ1 ప ని2 ప సా

అవ::సా ని2 ప మ1 గ2 స

పల్లవి

భావములోన బాహ్యము నందును
భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద అని కొలువావో మనసా 

భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద అని కొలువావో మనసా

భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద అని కొలువావో మనసా
భావములోన బాహ్యము నందును..ఊఊఊఊ

చరణం::1

హరియవతారములే అఖిల దేవతలు
హరిలోనివే బ్రంహాండంబులు 2
హరినామములే అన్ని మంత్రములు 2
హరి హరి హరి హరి హరి ఎనవో మనసా 2

భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద అని కొలువావో మనసా
భావములోన బాహ్యము నందును..ఊఊఊఊ

చరణం::2

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు 2
విష్ణుడొక్కడే విస్వంతరాత్ముడు 2
విష్ణువు విష్ణువని వెదకవో మనసా 2

భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద అని కొలువావో మనసా
భావములోన బాహ్యము నందును..ఊఊఊఊ 

చరణం::3

అచ్యుతుడితడే ఆదియునంత్యము 2
అచ్యుతుడే అసురాంతకుడు 
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదానిదే 2    
అచ్యుత అచ్యుత శరణనవో మనసా 2

భావములోన బాహ్యము నందును
గోవింద గోవింద అని కొలువావో మనసా
భావములోన బాహ్యము నందును..ఊఊఊఊ



Sudda Dhanyaasi::Ragam

22 kharaharapriya janya

Aa::S G2 M1 P N2 P S
Av::S N2 P M1 G2 S

Composer: Annamaacaarya

Pallavi 

Bhaavamulona baahyamunanduna 
Govinda Govinda ani koluvavo manasaa 

Bhaavamulona baahyamunanduna 
Govinda Govinda ani koluvavo manasaa

Bhaavamulona baahyamunanduna 
Govinda Govinda ani koluvavo manasaa
Bhaavamulona baahyamunanduna..uuuuuuu

Charanam 1 

Hari avathaaramule akhila devatalu 
Hari lonive brahmandammulu 2
Hari naamamule anni manthramulu 2
Hari Hari Hari Hari ~ Hari anavo manasa 2

Bhaavamulona baahyamunanduna 
Govinda Govinda ani koluvavo manasaa
Bhaavamulona baahyamunanduna..uuuuuuu

Charanam 2

Vishnuni mahimale vihita karmamulu 2
Vishnuni pogadedi vedammulu 2
Vishnudu okkade vishvaantaraathmudu 2
Vishnuvu Vishnuvani vedakavo manasaa 2

Bhaavamulona baahyamunanduna 
Govinda Govinda ani koluvavo manasaa
Bhaavamulona baahyamunanduna..uuuuuuu

Charanam 3

Achyuthudithade aadiyu nantyamu 2
Achyuthude asuraantakudu
Achyuthudu Sri Venkatadri meedaa neeve 2
Achyutha Achyutha Sharananavo manasaa 2

Bhaavamulona baahyamunanduna 
Govinda Govinda ani koluvavo manasaa
Bhaavamulona baahyamunanduna..uuuuuuu

Friday, May 2, 2014

ఆనందభైరవి::రాగం


 ఆనందభైరవి::ఆది తాళా

పల్లవి::

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

అనుపల్లవి::

కుమార జనని సమానమెవరిలను
మానవతి శ్రీ బృహన్నాయకీ 

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

చరణం::1

సరోజ ముఖి బిరాన నీవు 
వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్ర నుత పురాణి
పరాముఖమేలనే తల్లి 

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

చరణం::2

ఉమా హంస గమనా తామసమా
బ్రోవ దిక్కెవరు నిక్కముగను
మాకిపుడభిమానము చూప 
భారమా వినుమా దయతోను

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

చరణం::3

సదా నత వర దాయకీ నిజ 
దాసుడను శ్యామ కృష్ణ సోదరి
గదా మొర వినవా దురిత 
విదారిణీ శ్రీ బృహన్నాయకీ 

హిమాచల తనయ బ్రోచుటకిది 
మంచి సమయము రావే అంబ

Friday, March 14, 2014

లలిత::రాగం





పల్లవి::


అరసినన్ను గాచినాతనికి శరణు
పరము నిహము నేలే పతికిని శరణు

చరణం:: 1

వేదములు దెచ్చినట్టివిభునికి శరణు
ఆదిమూలమంటే వచ్చినతనికి శరణు
యేదెసా తానైయున్న యీతనికి శరణు
శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు

చరణం:: 2

అందరికి ప్రాణమైన ఆతనికి శరణు
ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు
దిందుపడి దేవతల దేవుడికి శరణు
అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు

చరణం:: 3

తానే చైతన్యమైన దైవానకు శరణు
నానా బ్రహ్మాండాలనాథునికి శరణు
ఆనుక శ్రీవేంకటాద్రి యందునుండి వరములు 
దీనుల కిందరి కిచ్చే దేవునికి శరణు

Raagam::Lalitha

:::

arasinannu gAchinAtaniki SaraNu
paramu nihamu nElE patikini SaraNu

:::1

vEdamulu dechchinaTTivibhuniki SaraNu
AdimUlamaMTE vachchinataniki SaraNu
yEdesA tAnaiyunna yItaniki SaraNu
SrIdEvi magaDaina SrIpatiki Saranu

:::2

aMdariki prANamaina Ataniki SaraNu
muMdu mUDu mUrtula mUrtiki SaraNu
diMdupaDi dEvatala dEvuDiki SaraNu
aMdi minnu nElanEkamainataniki SaraNu

:::3

tAnE chaitanyamaina daivAnaku SaraNu
nAnA brahmAMDAlanAthuniki SaraNu
Anuka SrIvEMkaTAdri yaMdunuMDi varamulu 
dInula kiMdari kichchE dEvuniki SaraNu