Showing posts with label రాగం::మోహన. Show all posts
Showing posts with label రాగం::మోహన. Show all posts

Thursday, June 28, 2012

మోహన ::: రాగం








మోహన రాగం

పల్లవి::

ఎవ్వడెరుగును మీయెత్తులు
మువ్వంక మెరసె మీ ముఱిపెమయ్య

చరణం::1

సొలపుల నిన్నాపె చూచీనీ
నలుగడ నీవేల నవ్వేవు
తెలియవు మాకు మీ తెఱగులు
బలిమిని యెట్టయినా బతుకరయ్యా

చరణం::2

విరులనాపె నిన్ను వేసీనీ
కెరలి బొమ్మల జంకించేవు
సరిగానము మీ చందములు
పరిపరి విధముల బ్రదుకరయ్యా

చరణం::3

పెనగి ఆపె నిన్ను పిలిచీనీ
యెనసితివి శ్రీవేంకటేశ్వరుడా
నను నేలితివిటు నయమునను
పనివడి యిట్లానే బ్రదుకరయ్య

ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ♥ॐ⊰⊱ॐ

Mohana ::: Raagam


Pallavi::>

evvaDerugunu mIyettulu
muvvaMka merase mI mu~ripemayya

charanam::1

solapula ninnApe chUchInI
nalugaDa nIvEla navvEvu
teliyavu mAku mI te~ragulu
balimini yeTTayinA bratukarayyA

charanam::2

virulanApe ninnu vEsInI
kerali bommala jaMkiMchEvu
sarigAnamu mI chaMdamulu
paripari vidhamula bradukarayyA

charanam::3

penagi Ape ninnu pilichInI
yenasitivi SrIvEMkaTESwaruDA
nanu nElitiviTu nayamunanu
panivaDi yiTlAnE bradukarayya

Sunday, September 4, 2011

మోహన :: రాగం












మోహన :: రాగం
ఆది ::తాళం


28 హరికాంభోజి జన్యము

ఆ: స రి2 గ3 ప ద2 సా
అవ: సా ద2 ప గ3 రి2 స.
రచన : అన్నమాచార్య

చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు


1)సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడునిలిచిననిలువున
నిఖిలదేవతలకలిగించు సురలగనివో యితడు


!! చేరి యశోదకు శిశు వితడు !!



2) మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు


!! చేరి యశోదకు శిశు వితడు !!


3) ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు


!! చేరి యశోదకు శిశు వితడు !!


Composer: Annamacharya
Singer: MS Subbulakshmi
Ragam: Mohanam
Thalam: Aadhi
Language: Telugu

Lyrics Credits:http://sahityam.net/wiki/Cheri_yasodaku

Pallavi
cheri yasodaku sisuvitadu
dharuni brahmaku tandriyu nitadu
cheri yasodaku sisuvu itadu
dharuni brahmaku tandriyunu itadu

Charanam
solasi chuchinanu suryachandrulanu
lalivedajalledu lakshanudu
nilichina niluvuna nikhila devatala
kaliginchu surala ganivo yitadu

mataladinananu mariyajandamulu
kotulu vodameti gunarasi
nituga nurpula nikhila vedamulu
catuva nureti samudruditadu

mungita polasina mohana matmala
ponginche ghana purushudu
sangathi mavanti saranagatulaku
angamu sri venkatadhipuditadu