Showing posts with label జయలక్ష్మి వరలక్ష్మి. Show all posts
Showing posts with label జయలక్ష్మి వరలక్ష్మి. Show all posts
Tuesday, October 11, 2011
లలిత ::: రాగం
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
ప్రియురాలవై హరికిఁ వెలసితివమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి
పాలజలనిధిలోని పసనైనమీఁగడ
మేలిమితామరలోని మించువాసన 2
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి
చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో
కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మాఇంటనే వుండవమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి
పదియారువన్నెలతో బంగారుపతిమ
చెదరనివేదములచిగురుఁబోడి
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి
Subscribe to:
Posts (Atom)