Saturday, February 29, 2020


లలిత సంగీతం::శ్రీరంగం గోపాలరత్నం


రచన::కోవెల సుగుణ
సంగీతం::శ్రీరంగం గోపాలరత్నం
తాళం::ఖండచాపు
రాగం::సింధు భైరవి

ప::చరణాలు..ముక్తి సోపానాలు
శరణన్న వారికవి..మోక్ష భవనాలు చరణాలు

1:చ::ధరణి సుత హృదయాన.. తనరారు చరణాలు
గిరిజేశ వాకృతులు..కీర్తించు చరణాలు

సిరిచూపు కలవారి..నివసించు చరణాలు
సరయూ నదీ తటిని..చరియించు చరణాలు 

చరణాలు..ముక్తి సోపానాలు
శరణన్న వారికవి..మోక్ష భవనాలు చరణాలు

2:చ::అజ్ఞాన తిమిరమున..విజ్ఞాన కిరణాలు
సుజ్ఞానులకు సకల..సౌవర్ణాభరణాలు
శాంతి కవి నిలయాలు..సౌందర్య వలయాలు
సంతోష ద్వారాలు..సకల శృతి తీరాలు..చరణాలు

చరణాలు..ముక్తి సోపానాలు
శరణన్న వారికవి..మోక్ష భవనాలు చరణాలు