Showing posts with label రాగం::రాగమాలిక. Show all posts
Showing posts with label రాగం::రాగమాలిక. Show all posts

Saturday, September 15, 2012

బృందావని,మాయామాళవగౌళ :: రాగమాలిక, మిశ్రచాపుతాళం









అన్నమయ్య సంకీర్తనలు
బృందావని,మాయామాళవగౌళ
రాగమాలిక, మిశ్రచాపుతాళం


పల్లవి::


ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు
ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు

అంతరాతరములెంచి చూడ
పిండంతేనిప్పటి అన్నట్లు
అంతరాతరములెంచి చూడ
పిండంతేనిప్పటి అన్నట్లు

ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు

చరణం::1


కొలుతురు మిము వైష్ణవులు
కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు
పరబ్రహ్మంబనుచు
కొలుతురు మిము వైష్ణవులు
కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు
పరబ్రహ్మంబనుచు

తలతురు మిము శైవులు
తగిన భక్తులును శివుడనుచు
తలతురు మిము శైవులు
తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు
కాపాలికులు ఆది భైరవుండనుచు
అలరి పొగడుదురు
కాపాలికులు ఆది భైరవుండనుచు

ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు

చరణం::2


సరి నెన్నుదురు శాక్తేయులు
శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానావిధములను
తలపుల కొలదుల భజింతురు
సరి నెన్నుదురు శాక్తేయులు
శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానావిధములను
తలపుల కొలదుల భజింతురు

సిరుల మిము నే అల్పబుద్ది దలచిన
వారికి అల్పంబవుదువు
గరిమిల మిము నే ఘనమని దలచిన
ఘన బుద్దులకు ఘనుడవు
నీ వలన కొరతే లేదు
మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల
ఆ జలమే ఊరినయట్లు
నీ వలన కొరతే లేదు
మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల
ఆ జలమే ఊరినయట్లు

శ్రీ వేంకటపతి నీవైతే
మము చేకొని ఉన్నా దైవము
శ్రీ వేంకటపతి నీవైతే
మము చేకొని ఉన్నా దైవమని
ఈవల నే నీ శరణననెదను
ఇదియే పర తత్త్వము నాకు
ఇదియే పర తత్త్వము నాకు
ఇదియే పర తత్త్వము నాకు