Showing posts with label రాగం::అఠాణా. Show all posts
Showing posts with label రాగం::అఠాణా. Show all posts

Sunday, August 18, 2013

అఠాణా::రాగం



















అఠాణా::రాగం
ఆది::తాళం

పల్లవి::

ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు

అనుపల్లవి::

బాల! కనకమయచేల! సుజనపరి
పాల! శ్రీరమాలోల! విధృతశర
జాల! శుభద! కరుణాలవాల! ఘన
నీల! నవ్య వనమాలికాభరణ!
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు

చరణములు:: 

రారా దేవాదిదేవ! రారా మహానుభావ!
రారా రాజీవనేత్రా! రఘువరపుత్రా!
సారతర సుధాపూర హృదయ పరి
వార జలధిగంభీర దనుజ సం
హార దశరథ కుమార బుధజన వి
హార సకలశృతిసార నాదుపై ॥ఏ॥

రాజాధిరాజ! మునిపూజితపాద! రవి
రాజలోచన! శరణ్య అతిలావణ్య!
రాజధరనుత! విరాజ తురగ! సుర
రాజవందిత పదాజ! జనక! దిన
రాజకోటి సమతేజ! దనుజగజ
రాజ నిచయ మృగరాజ! జలజముఖ! 
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు

యాగరక్షణ! పరమ భాగవతార్చిత!
యోగీంద్ర సుహృద్భావిత! ఆద్యంతరహిత!
నాగశయన! వరనాగ వరద! పు
న్నాగ సుమధుర! సదాఘమోచన! స
దాగతిజ ధృతపదా! గమాంతరచర!
రాగ రహిత! శ్రీత్యాగరాజ సుత 
ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయముగాదు