Wednesday, November 23, 2016

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి నివాళి అర్పిస్తూ ___/\___












రాగం::సింధుభైరవి
తాళం::ఆది 
రచన::శ్రీ ప్రయాగ రంగదాసు గారు
గానం::మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు  

పల్లవి::

హరీ..ఈ..
రామ రామ యన రాదా..ఆ 
రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

రామరామ యనరాదా..ఆ 

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

అనుపల్లవి:: 

కామజనకుని కథ వినువారికి ..3
కైవల్యంబే కాదా..ఆ

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

కామజనకుని కథ వినువారికి ..3
కైవల్యంబే కాదా..ఆ

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

చరణం::1

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధింపగరాదా..3 
పాపంబులు పరిహారము చేసెడి
పాపంబులు పరిహారము చేసెడి
పాపంబులు పరిహారము చేసెడి పరమాత్ముండే కాదా 

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

చరణం::2

వసుధను గుడిమెళ్ళంకను వెలసిన వరగోపాలుడే కాదా
వసుధను గుడిమెళ్ళంకను 
వసుధను గుడిమెళ్ళంకను వెలసిన వరగోపాలుడే కాదా
వసుధను గుడిమెళ్ళంకను 
వసుధను గుడిమెళ్ళంకను వెలసిన వరగోపాలుడే కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా  

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

కామజనకుని కథ వినువారికి ..3
కైవల్యంబే కాదా..ఆ

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా
రఘుపతి రక్షకుడని వినలేదా
రఘుపతి రక్షకుడని వినలేదా
రక్షకుడని వినలేదా..రక్షకుడని వినలేదా

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

చరణం::3

నారదాది మునులెల్ల భజించెడి నారాయణుడే కాదా 
కోరిన కోరికలెల్ల నొసంగెడి గుణశాలని వినలేదా

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

చరణం::4

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగరాదా 
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమె కాదా

రామరామ యనరాదా 
రఘుపతి రక్షకుడని వినలేదా

రామరామ యనరాదా
రఘుపతి రక్షకుడని వినలేదా

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Sindhubhairavi::Raagam
Adi-Taalam 
Lyrics::Sree prayaaga rangadaasu gaaru
Singer::Mangalam palli Balamuralikrishna gaaru

:::::::::::::::::::::::::::::::::::::::::

harii..ii..ii
raama raama yana raadaa..aa 
raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

raamaraama yanaraadaa..aa 

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

anupallavi:: 

kaamajanakuni katha vinuvaariki ..3
kaivalyaMbE kaadaa..aa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

kaamajanakuni katha vinuvaariki ..3
kaivalyaMbE kaadaa..aa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

::::1

aapadbaandhavuDagu Sreeraamuni aaraadhinpagaraadaa..3 
paapambulu parihaaramu chEseDi
paapambulu parihaaramu chEseDi
paapambulu parihaaramu chEseDi  paramaatmunDE kaadaa 

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

::::2

vasudhanu guDimeLLankanu velasina varagOpaaluDE kaadaa
vasudhanu guDimeLLankanu 
vasudhanu guDimeLLankanu velasina varagOpaaluDE kaadaa
vasudhanu guDimeLLankanu 
vasudhanu guDimeLLankanu velasina varagOpaaluDE kaadaa
pasivaaDagu Sree rangadaasuni paalinchaga vinalEdaa  

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

kaamajanakuni katha vinuvaariki ..3
kaivalyambE kaadaa..aa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinalEdaa

raghupati rakshakuDani vinalEdaa
raghupati rakshakuDani vinalEdaa

rakshakuDani vinalEdaa..rakshakuDani vinalEdaa

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

::::3

naaradaadi munulella bhajincheDi naaraayaNuDe kaadaa 
kOrina kOrikalella nosangeDi guNaSaalani vinaledaa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinaledaa

::::4

saaraheena samsaara bhavaambudhi saraguna daaTagaraadaa 
neerajaakshuni niratamu nammina nityaanandame kaadaa

raamaraama yanaraadaa 
raghupati rakshakuDani vinaledaa

raamaraama yanaraadaa

raghupati rakshakuDani vinaledaa

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

జననం
6 జులై, 1930
శంకరగుప్తం, రాజోలు తాలుకా, తూర్పు గోదావరి జిల్లా
నివాస ప్రాంతం చెన్నై , తమిళనాడు

ఇతర పేర్లు మంగళంపల్లి
వృత్తి కర్ణాటక సంగీత విద్వాంసులు
ప్రసిద్ధి కర్ణాటక సంగీత విద్వాంసులు
సాధించిన విజయాలు పద్మ విభూషన్
మతం హిందు

తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య
తల్లి సూర్యకాంతమ్మ

రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930వ సంవత్సరం జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు.

8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ఉన్నాడు. 

ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మళయాళం సినిమాలో నటించాడు. 

పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు.

బాల్యం మరియు నేపథ్యం

బాలమురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని శంకరగుప్తంలో జన్మించాడు. ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. 

ఆయన ప్రముఖ సంగీతకారుడు మరియు వేణువు, వయోలిన్, వీణ విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. 

పుట్టిన 13వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్ముమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. 

చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు.

ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనలో కచేరి చేశాడు. 

అతని తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేయగా ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ "బాల" అని పేరుకు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.

వృత్తి జీవితం

కర్ణాటక సంగీతం

విషయాలు

శృతి • స్వరం • రాగం • తాళం • మేళకర్త

కూర్పులు
వర్ణం • కృతి • గీతం • స్వరజతి • రాగం తానం పల్లవి • తిల్లానా

వాయిద్యాలు

వీణ • తంబురా • మృదంగం • ఘటం • మోర్‌సింగ్ • కంజీర • వయోలిన్

సంగీతకారులు

కర్నాటక సంగీతకారుల జాబితా

బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసు లో ప్రారంభించాడు. 

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25000 కచేరీలు చేశాడు. 

సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము,మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. 

హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పని చేశాడు మరియు జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. 

ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషి తో కలిసి ముంబయి లో నిర్వహించారు. 

పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితొ కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. 

ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. 

బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. 

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు [1].

కచేరీలు

కువైట్ లో 29 మార్చి 2006 న జరిగిన కచేరీలో బాలమురళీకృష్ణ
తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగాడు. 

అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడు. 

అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. 

చిన్నవయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. 

క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది.

బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేశియా, సింగపూర్ మరియు అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. 

తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడాడు. భక్త ప్రహ్లాద చిత్రంలో నారదునిగా నటించటమే కాక తన పాటలు తానే పాడుకున్నాడు.

బిరుదులు మరియు పురస్కారాలు


బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. 

వాటిలో కొన్ని :- సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.

దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించాడు. 

కర్నాటక సంగీతకారులలో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. 

పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.

రాగాలు

మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించాడు.[2] ఈ కొత్త రాగాలు కనిపెట్టడం వల్ల ఆయన కొన్ని విమర్శలకు కూడా గురయ్యాడు.

జీవితంపై పుస్తకాలు

బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణ ఉపోద్ఘాతం రాశాడు.
rachana:: sai kishor kalapala

మంగళంపల్లి గారు గానం చేసిన ఒక
అ ద్భుతమై న తత్త్వం.



ఏమి సేతురా లింగా..ఏమీ సేతురా
గంగ ఉదకము..తెచ్చి నీకు
లింగ పూజలు సేదమంటె
గంగనున్న చేప కప్ప..ఎంగిలంటున్నాది లింగా
మహానుభావ మా(హ)దేవశంభో మాలింగమూర్తి..

అక్షయావుల పాడి తెచ్చి
అరిపితము చేదమంటె..ఒహో
అక్షయావుల లేగదూడ..ఎంగిలంటున్నాది లింగా
మహానుభావ మా(హ)దేవశంభో మాలింగమూర్తి

తుమ్మిపూవులు తెచ్చి నీకు
తుష్టుగా పూచ్చేదమంటె..ఓహో
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద..ఎంగిలంటున్నాది లింగా
మహానుభావ మా(హ)దేవశంభో మాలింగమూర్తి

1 comment:

Unknown said...

Very comprehensive but brief
Thanks for the posting.
God bless you