Monday, October 3, 2011

సౌరాష్ట్రం ::: రాగం: :ఆదితాళం



రచన: త్యాగరాజస్వామిఘళ్


!!పల్లవి!!

శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా
సేవింప రారే ...

!!అనుపల్లవి!!

వాగాధిపతి సు-పూజల చేకొని బాగ నటింపుచు వెడాలిన

!! శ్రీ గణపతిని !!
!!చరణం !!

పనస నారికేలాది జంబూ ఫలములనారగించి ఘన తరంబగు మహిపై పదములు
ఘల్లు ఘల్లన నుంచి అనయము హరి చరణ యుగములను హౄదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన

!! శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా
సేవింప రారే ... !!

No comments: