Tuesday, October 11, 2011

ఆనంద భైరవి ::: రాగం












ఆనంద భైరవి ::: రాగం

కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని॥

కంటి శుక్రవారము గడియ లేడింట

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరుచెమ్మతోన
వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద యైచాయతోన నెమ్మది నుండే స్వామిని

కంటి శుక్రవారము గడియ లేడింట

పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలదిఅచ్చెరపడి చూడ
అందరి కన్నులకింపై
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని
కంటి శుక్రవారము గడియ లేడింట

తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించిదట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
కంటి శుక్రవారము గడియ లేడింట

.••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•..••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•..••.¸•.••.¸•...••.¸•..••.¸•..••.¸•.


pallavi::

kaNTi SukravAramu gaDiyalEDiNTa
aNTi alamElmanga aNDanuNDE svAmini

charaNam::1
sommulannI kaDa peTTi somputO gONamu gaTTi
kammani kadambamu kappu pannIru
chemmatOna vEShTuvalu rommu tala mola juTTi
tummeda mai chAyatOna nemmadinuNDE svAmini

charaNam::2
pachcha kappuramE nUri pasiDi ginnela ninchi
techchi SirasAdiga diganaladi
achchera paDi chUDanandari kanulakimpai
nichchamalle pUvu vale niTu tAnuNDE svAmini

charaNam::3

taTTu punugE kUrichi chaTTalu chErichi nippu
paTTi kariginchu veNDi paLyAla ninchi
daTTamuga mEnu niNDa paTTinchi diddi
biTTu vEDuka muriyuchuNDE bittari svAmini

No comments: