Tuesday, October 11, 2011

శ్రీ ::: రాగం














శ్రీ రాగం

ప) రాజీవ నేత్రాయ రాఘవాయ నమో
సౌజన్య నిలయాయ జానకీశాయ

చ) దశరథ తనూజాయ తాటక దమనాయ
కుశిక సంభవ యజ़్జ గోపనాయ
పశుపతి మహా ధనుర్భంజనాయ నమో
విశద భార్గవరామ విజయ కరుణాయ

చ) భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ
ఖరదూషణాయ రిపు ఖండనాయ
తరణి సంభవ సైన్య రక్షకాయనమో
నిరుపమ మహా వారినిధి బంధనాయ

చ) హత రావణాయ సంయమి నాథ వరదాయ
అతులిత అయోధ్యా పురాధిపాయ
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో
వితత వావిలిపాటి వీర రామాయ

No comments: