కాంభోజి ::: రాగం తాళం ఆది
పల్లవి) మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె
ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు !!
1చరణం) చక్కని యశోద తన్నుసలిగతో మొత్తరాగా
మొక్క బోయీ గాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక
ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు !!
2చరణం) రువ్వెడి రాళ్ళదల్లి రోల దన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె
మువ్వురిలో నెక్కుడైన ముద్దులాడు !!
3చరణం) వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా
మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీదనున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు !!!
mottakurae ammalaala muddulaaDu veeDe
muttemuvale nunnaaDu muddulaaDu
...
chakkani yaSOda tannu saligatO mottaraagaa
mokkabOyee gaaLLaku muddulaaDu
vekkasaana raepalle vennelella maapudaaka
mukkuna vayyaga dinna muddulaaDu
...
ruvveDi raaLLa dalli rOladannu gaTTenaMTa
muvvala gaMTalatODi muddulaaDu
navveDi jekkula niMDa nammika baalunivale
muvvarilO nekkuDaina muddulaaDu
...
vaela saMkhyala satula veMTabeTTukoni raagaa
moola jannu guDicheeni muddulaaDu
maelimi vaeMkaTagiri meedanunnaaDidevachchi
moolabhooti daanaina muddulaaDu
ఓ అమ్మలాల ! ముద్దొచ్చే ఈ బాలుడ్ని మొత్తకండే। ముత్యంలా ఉన్నడే ఈ ముద్దులాఁడు।
అందమైన యశోద తనను సలిగ(?)తో కొట్టరాగా ఈ ముద్దులాడు కాళ్ళకు మొక్కబోతున్నాడే!
దుస్సహముతో రేపల్లెలో వెన్నలన్నీ మాపుదాకా ముక్కుపగిలిందాకా తిన్నముద్దులాడే!
సరిచేసిన తాళ్ళతో తల్లి తనను రోలికి కట్టెనంటా మువ్వల గంటలతో ఆగం చేస్తున్న ముద్దులాడే!
నవ్వే చెక్కులనిండా నమ్మికబాలునిలా ముగ్గురు మూర్తులలోన ఎక్కుడైన ముద్దులాడే!
వేలసంఖ్యలోవున్న భార్యలందరితో వస్తే ఓ మూల తల్లి చన్నుతాగుతూ ఉన్నాడే ముద్దులాడు!
అన్నింటికి తానే మూలభూతమైన ముద్దులాడు మేలిమి శ్రీవేంకటగిరి మీద వచ్చి వున్నాడిదే.
No comments:
Post a Comment